
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సుజీత్ తో చేస్తున్న భారీ సినిమా ఓజీ. పాన్ ఇండియా లెవల్లో ఓజీ సినిమా పై ఏ స్దాయిలో అంచనాలు ఉన్నాయో తెలిసిందే. ప్రస్తుతం పవన్ నటిస్తోన్న హరిహర వీరమల్లు సినిమా వచ్చే నెలలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. వీరమల్లు ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉన్నా రకరకాల కారణాలతో వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. అయితే వీరమల్లు సినిమా కంటే ముందుగానే ఓజీ గురించి ఓ అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఓజీ సినిమా ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేస్తారట. ఇది చాలా పవర్ ఫుల్ గా ఉండబోతోందని తెలుస్తోంది.
వాస్తవానికి ఓజీ ఫస్ట్ సింగిల్ మేకర్స్ ఎప్పుడో… విడుదల చేయాల్సి ఉన్నా పలు కారణాలతో చేయలేదు. ముఖ్యంగా దీనికి ముందు హరిహర వీరమల్లు విడుదల కావాల్సి ఉంది. ఇప్పుడు వీరమల్లు వాయిదా పడడంతో ఆ సినిమా కంటే ముందుగానే ఓజీ ఫస్ట్ సింగల్ వచ్చేస్తుందని అంటున్నారు. అంటే ఓజీ ర్యాంపేజ్ తో వీరమల్లు సినిమాకు కూడా మంచి ఊపు వస్తుంది అనడంలో సందేహం లేదు. ఆల్రెడీ శింబుతో థమన్ కంపోజ్ చేసిన ఈ పాటపై మంచి అంచనాలు ఉన్నాయి. మరి దీనిపై అధికారిక క్లారిటీ మేకర్స్ ఇవ్వాల్సి ఉంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు