
హీరోయిన్ గా ఫేడౌట్ అయిన కొంత కాలానికి ఆమె సహాయక నటిగా మారారు. తల్లి, అత్త వంటి పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. `బాహుబలి`లో శివగామిగా నటించి జాతీయస్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న రమ్యకృష్ణ.. సెకండ్ ఇన్నింగ్స్ లోనూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇక నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో రమ్యకృష్ణ ఎన్నో సినిమాలు చేశారు. మరెన్నో విభిన్న పాత్రలను పోషించారు.
అటువంటి నటీమణికి తండ్రిగా, అన్నగా, భర్తగా నటించిన ఏకైక నటుడు ఎవరో తెలుసా.. నాజర్. రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ `నరసింహ` లో రమ్యకృష్ణ, నాజర్ అన్న చెల్లెలుగా నటించారు. అదే వీరిద్దరూ తమిళంలో హిట్ గా నిలిచిన `వంత రాజవతాన్ వరువేన్` చిత్రంలో తండ్రీకూతురుగా నటించారు. ఈ సినిమాను తెలుగులో `అత్తారింటికి దారేది` పేరిట రీమేక్ చేయగా.. రమ్యకృష్ణ పాత్రలో నదియా, నాజర్ క్యారెక్టర్ లో బొమన్ ఇరానీ యాక్ట్ చేయడం జరిగింది. ఇక దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన `బాహుబలి` సినిమాలో శివగామిగా రమ్యకృష్ణ నటిస్తే.. ఆమె భర్త బిజ్జలదేవ పాత్రలో నాజర్ కనిపిస్తారు. అలా ఓకే నటుడికి చెల్లిగా, కూతురిగా, భార్యగా నటించి రమ్యకృష్ణ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు