
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ సినిమా ది రాజాసాబ్ నుంచి టీజర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. దర్శకుడు మారుతి తెరకెక్కిస్తోన్న ఈ సినిమా టీజర్ ఒక్కసారిగా సినిమాపై హైప్ పెంచేసింది. కంప్లీట్ హర్రర్ ఫాంటసి సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఊహించని విధంగా థ్రిల్ కు గురి చేస్తుందన్న అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో ప్రభాస్ బాక్సాఫీస్ దగ్గర మరోసారి ట్రెండ్ క్రియేట్ చేయడం ఖాయమన్న లెక్కలు ఉన్నాయి. ఈ సినిమాలో అందాల భామలు నిధి అగర్వాల్ - మాళవిక మోహనన్ - రిద్ది కుమార్ హీరోయిన్ గా నటిస్తున్నారు. నిధి అగర్వాల్ ఈ సినిమా కోసం కొత్త స్టెప్ వేసినట్టు తెలుస్తోంది.
ప్రభాస్ పై కాస్త ఎక్కువ ప్రేమ చూపించింది. రాజాసాబ్ టీజర్ కోసం నిధి అగర్వాల్ తన పాత్రకు తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకుందట. దీంతో ఆమె పాత్ర కచ్చితంగా ప్రేక్షకులను థ్రిల్‌కు గురి చేసేలా ఉంటుందని చెబుతున్నారు. ఈ విషయంలో నిధి కూడా ఫుల్ కాన్ఫిడెంట్గా చెప్తుంది. సినిమాలో ప్రభాస్ రెండు వైవిధ్యమైన పాత్రలలో నటిస్తుండగా ... బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ కీలకపాత్రలో నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో రాజాసాబ్ తెరకెక్కుతోంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు