
టాలీవుడ్ పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తోన్న పాన్ ఇండియా సినిమా ది రాజాసాబ్. కల్కి, సలార్ రెండు బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా హిట్ సినిమాల తర్వాత ప్రభాస్ నటిస్తోన్న ఈ సినిమా పై మామూలు అంచనాలు లేవు. మారుతి దర్శకత్వం వహిస్తోన్న ది రాజాసాబ్ టీజర్ ఇటీవల రిలీజ్ అయ్యి యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. ఇక ఈ సినిమా స్టోరీ పై దర్శకుడు మారుతి ఇంట్రస్టింగ్ కామెంట్లు చేశారు. ఇదొక ఎమోషనల్ జర్నీ అని తెలిపారు. ఇందులో ఎన్నో భావోద్వేగాలు ఇమిగి ఉంటాయని .. ఇందులో మనవడు ... తాతమ్మ . . నానమ్మ మధ్య ఉన్న అనుబంధం ఇందులో ఉందన్నారు.
తెరపై ఈ సినిమా చూశాక ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోతామని.. ఇండియన్ సినీ స్క్రీన్ పై ఇప్పటి వరకు ఈ తరహా కథతో సినిమా రాలేదని మారుతి తెలిపారు. మారుతి చెప్పిన ఈ లీక్ తర్వాత సినిమా పై అంచనాలు మరింత థ్రిల్లింగ్ గా ఉన్నాయి. ఈ సినిమా లో ప్రభాస్ కు జోడీ గా ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. నిధి అగర్వాల్ - రిద్ది కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. డిసెంబర్ 5న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు