
కానీ ప్రభాస్ మాత్రం అసలు స్పందించలేదు. దీంతో సోషల్ మీడియాలో ఆయనపై హ్యూజ్ ట్రోల్లింగ్ జరిగింది . ఆపరేషన్ సింధూర్ పై కూడా స్పందించని అంత తీరిక లేదా..? అంత బిజీనా..? ఈ సార్ కి అంటూ హ్యూజ్ నెగిటివిటీ ఏర్పడింది. దీంతో ప్రభాస్ స్పందించాడు . "ఆపరేషన్ సింధూర్ పై పాజిటివ్ గా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు". అంత లేజీ బాయ్ ప్రభాస్ అంటూ కొంతమంది ట్రోల్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. ప్రభాస్ " కన్నప్ప" సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ లో మెరవబోతున్నాడు అని తెలియగానే అందరూ షాక్ అయ్యారు.
ప్రభాస్ కి ఎంత టైం ఉందా..? అని కూడా మాట్లాడుకున్నారు. ఎలాగోలో ఆయన తన ఫేవరేట్ రోల్ కోసం కాల్ షీట్స్ అడ్జెస్ట్ కన్నప్ప చిత్రంలో తన భాగాన్ని కంప్లీట్ చేశారు . కన్నప్ప చిత్రం సినిమా రిలీజ్ కి సిద్ధమైంది. ఈ సినిమాకు ప్రమోషన్స్ కూడా బాగానే నిర్వహిస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని ప్రమోట్ చేసేందుకు ప్రభాస్ పలు ఈవెంట్స్ కు వస్తారు అని అంతా అనుకున్నారు . ప్రభాస్ ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ . ప్రభాస్ ప్రమోషన్ చేస్తే కచ్చితంగా సినిమా వేరే లెవెల్ లో ఉంటుంది .
కానీ ప్రభాస్ ప్రమోషన్ చేయడానికి టైం సరిపోవడం లేదు . ఆ కారణంగా ప్రభాస్ తన సపోర్ట్ ని తెలియజేస్తూ ఇన్స్టా స్టోరీలో కన్నప్ప చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నారు. " కన్నప్ప లాంటి పరమ భక్తుడు .. అతని త్యాగం గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అంటే ఈ "కన్నప్ప" సినిమాను చూడాలి అంటూ ప్రభాస్ కోరారు". దీంతో సోషల్ మీడియాలో కన్నప్ప సినిమా హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అంతేకాదు ఈ సినిమాలో "రుద్ర" అనే పాత్రలో ప్రభాస్ మనకు కనిపించబోతున్నాడు . ఈ పాత్ర ప్రేక్షకులను కచ్చితంగా అలరిస్తుంది అని రిలీజ్ అయిన ట్రైలర్ ఆధారంగా తెలిసిపోతుంది. ఈ సినిమాలో డాక్టర్ మోహన్ బాబు - మోహన్ లాల్ - శరత్ కుమార్ - అక్షయ్ కుమార్ - కాజల్ అగర్వాల్ లాంటి స్టార్స్ కూడా నటిస్తున్నారు. జూలై 27వ తేదీ గ్రాండ్గా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కూడా రెడీ అయింది..!