- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

క్లాస్ సినిమాల నిర్మాత దిల్ రాజు నుంచి సినిమాలు వస్తున్నాయి అంటే కచ్చితంగా ఫ్యామిలీతో చూడాల్సిన విధంగా ఉంటాయని అభిప్రాయం ఉంది. దిల్ రాజు అలాంటి సబ్జెక్టులే ఏ కోరించుకుంటారు. మంచి క్లీన్ సినిమాలు అందించడం స్పెషాలిటీ. ఆయ‌న‌ నిర్మించే సినిమాలో యాక్షన్ బ్లాక్ లు ఉంటాయి . .  కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. కానీ ఏ సర్టిఫికెట్ రేంజ్ లో ఉండవు. గతంలో రామయ్య వస్తావయ్యా - ఎవడు సినిమాలు రెండు ఏ సర్టిఫికెట్ సినిమాలే. మళ్లీ తాజాగా ఆయన బ్యానర్లో వస్తున్న తమ్ముడు సినిమాకు ఏ స‌ర్టిఫికెట్ అందింది. నితిన్ - వేణు శ్రీరామ్ కాంబినేషన్లో ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్ వచ్చింది. ఈ సినిమాను భారీగా ఎంతో లావిష్ గా నిర్మించారు.


సినిమా టైటిల్ తమ్ముడు .. కానీ సినిమాలో యాక్షన్ సీన్లు భారీగా ఉంటాయని అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మీటర్ మీద సినిమా వస్తుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అక్క , తమ్ముడు సెంటిమెంట్ మాత్రం ఉంటుందని దిల్ రాజు చెబుతున్నారు. ఇప్పటికే టీజర్ బయటికి వచ్చింది. సినిమా భారీ యాక్షన్ తో ఉంటుందని అర్థం అయింది. ఇప్పుడు ఏ సర్టిఫికెట్ వచ్చింది . .  సెన్సార్ అధికారులు కొన్ని కట్స్ చెప్పారు. నిర్మాత , దర్శకులు కాస్త రాజీపడి కట్స్ తీసుకుని యూ / ఏ రావడానికి అవకాశం ఉంటుంది. అయినా ఏ సర్టిఫికెట్ తీసుకున్నారు అంటే సినిమాలో యాక్షన్ చెడిపోకూడదు అని దిల్ రాజు డిసైడ్‌ అయినట్టు కనిపిస్తోంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: