
A22 x A6 గా పిలవబడుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్‌లో కనిపించబోతున్నాడని బలమైన టాక్ ఉంది. మరోవైపు కథానాయుకల విషయంలోనూ రకరకాల ప్రచారాలు తెరపైకి వచ్చాయి. బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పదుకొణె ఈ మూవీలో మెయిన్ హీరోయిన్ గా అలరించబోతుంది. అలాగే ఆమెతో పాటు మరో ముగ్గురు టాప్ హీరోయిన్స్ సందడి చేయబోతున్నారట.
ఆ జాబితాలో మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ ఆల్మోస్ట్ ఫిక్స్ అయ్యారని వార్తలు వస్తున్నాయి. అలాగే నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కూడా అల్లు అర్జున్ - అట్లీ చిత్రంలో భాగం అవ్వబోతుందని.. ఇప్పటికే మేకర్స్ ఆమెతో సంప్రదింపులు జరిపారని తెలుస్తోంది. ఇక మరోవైపు హాలీవుడ్ సూపర్ స్టార్, ఆస్కార్ విజేత విల్ స్మిత్ ను విలన్ క్యారెక్టర్ కోసం రంగంలోకి దింపాలని మేకర్స్ ప్రయత్నాలు షురూ చేసినట్లు టాక్ ఉంది. ఏదేమైనా ఇంకా సెట్స్ మీదకు వెళ్లకముందే సినిమాపై భారీ హైప్ ఏర్పడింది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు