సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కొంత మంది చాలా తక్కువ కాలం లోనే అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంటూ ఉంటారు. సినిమా ఇండస్ట్రీ లో కొంత మంది కెరియర్ను ప్రారంభించినప్పటి నుండి అందాల ఆరబోతతో కుర్రాళ్ల హృదయాలను గెలుచుకుంటూ ఉంటారు. ఇక మరి కొంత మంది మాత్రం కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటూ స్కిన్ షో కు కూడా దూరంగా ఉంటూ పద్ధతి గల పాత్రలలో నటిస్తూ తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటారు. ఇకపోతే పైన ఫోటోలో ఒక చిన్న పాప ఉంది కదా ఆమె ఎవరో గుర్తుపట్టారా ..? ఆమె మలయాళ సినిమాలతో నటిగా కెరియర్ను మొదలు పెట్టి అక్కడ అద్భుతమైన గుర్తింపును సంపాదించుకొని , ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి తెలుగు లో కూడా సూపర్ సాలిడ్ క్రేజ్ ను సంపాదించుకుంది.

ప్రస్తుతం ఈమె అత్యంత భారీ బడ్జెట్తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఓ హిందీ సినిమాలో కూడా నటిస్తోంది. ఆ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు కూడా ఉన్నాయి. ఇప్పటికైనా పైన ఫోటోలో ఉన్న ఆ నటి ఎవరో గుర్తుపట్టారా ..? ఆమె మరెవరో కాదు అద్భుతమైన క్రేజ్ కలిగిన నటీమణులలో ఒకరు అయినటువంటి సాయి పల్లవి. ఈ నటి ప్రేమమ్ అనే మలయాళ సినిమాతో మంచి విజయాన్ని , మంచి గుర్తింపును దక్కించుకుంది. ఆ తర్వాత ఫిదా అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యి ఇక్కడ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. 

ప్రస్తుతం ఈమె రన్బీర్ కపూర్ హీరోగా రూపొందుతున్న రామాయణం సినిమాలో నటిస్తోంది. సాయి పల్లవి ప్రస్తుతం ఒక్కో సినిమాకు ఏకంగా 10 కోట్ల వరకు పారితోషకాన్ని పుచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈమె ఇప్పటివరకు ఎక్కువ శాతం కమర్షియల్ సినిమాల జోలికి పోకుండా , స్కిన్  షో కి ఆమడ దూరంగా ఉంటూ కెరియర్ను అద్భుతమైన రీతిలో ముందుకు సాగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: