
టాలీవుడ్‌లో ఈ దసరాకు అఖండ - ఓజీ వంటి రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటకి అయితే ఈ రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయన్న వార్తలే వినిపిస్తున్నాయి. రెండు పెద్ద హీరోల సినిమాలే.. పైగా ఇద్దరు ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు. పవన్ అయితే ఉప ముఖ్యమంత్రి గా కూడా ఉన్నారు. రెండు క్రేజీ ప్రాజెక్టులే. అఖండ లాంటి సూపర్ బ్లాక్ బస్టర్‌కు సీక్వెల్ గా అఖండ 2 వస్తోంది. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో హీరో పాత్రలో బాలకృష్ణ నటన, పవర్‌ఫుల్ డైలాగులు, యాక్షన్ సీక్వెన్సులు, సస్పెన్స్, భక్తి అంశాలు తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. అద్భుతమైన విజువల్స్‌కు తోడు థమన్ నేపథ్య సంగీతం పూనకాలు తెప్పించింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా అఖండ 2 తెరకెక్కింది.
ఇక ఓజీ విషయానికి వస్తే సాహో తర్వాత డైరెక్టర్ సుజిత్ డైరెక్ట్ చేసిన సినిమా ఇది. సినిమాలో యాక్షన్, మిస్టరీ అదిరిపోతుందట. ప్రేక్షకులను చివరి వరకు సస్పెన్స్‌తో థ్రిల్ చేస్తుందంటున్నారు. ఇక ఈ రెండు సినిమాల క్రేజ్ పోల్చి చూసినప్పుడు ఇప్పటి వరకు ఉన్న అంచనాల ప్రకారం అఖండ 2 ఓ మెట్టు పైన ఉంది. ఓజీ కూడా స్టార్టింగ్‌లో బాగా హైప్ తెచ్చుకున్నా తర్వాత అఖండ 2 క్రేజ్ అందుకోవడానికి ఓజీకి కాస్త టైం పట్టిందనే చెప్పాలి. ఇక ఓజీ సినిమా కు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే హయ్యస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంక్వైరీలు నడుస్తున్నాయి. అటు అఖండ 2 సినిమా కు సైతం బాలయ్య కెరీర్‌లోనే ఎప్పుడూ జరగనంత బిజినెస్ ఏరియాల వారీగా నడుస్తోంది. మరి ఈ రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే ఏ హీరో పై చేయి సాధిస్తాడో ? చూడాలి.