పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం హరిహర వీరమల్లు.  దాదాపు రెండేళ్లు సినిమా ఇండస్ట్రీకి గ్యాప్ తీసుకొని.. ఈ సినిమాతో జూలై 24న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. నిధి అగర్వాల్ హీరోయిన్గా రాబోతున్న ఈ చిత్రానికి ఏ.ఎం.రత్నం నిర్మాతగా వహిస్తున్నారు. భారీ బడ్జెట్లో రూపొందుతున్న ఈ చిత్రానికి మొదట క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించినా.. ఆ తర్వాత కొన్ని కారణాలవల్ల ఆయన తప్పుకోవడంతో రంగంలోకి రత్నం వారసుడు జ్యోతి కృష్ణ రంగంలోకి దిగారు. ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్ పూర్తయింది.


ఇక విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో జూన్ 21 హైదరాబాద్ శిల్పకళా వేదికగా హరిహర వీరమల్లు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఇక ఆ సమయంలో క్రిష్ జాగర్లమూడి నుంచి ఒక్క మాట కూడా బయటకు రావడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎందుకు క్రిష్ సైలెంట్ గా ఉన్నారు అంటూ అనుమానాలు వ్యక్తం చేయగా.. తాజాగా ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా హరిహర వీరమల్లు సినిమాపై అంచనాలు పెంచేశారు. ఈ సినిమా ప్రపంచ నిర్మాణానికి పునాది అంటూ ట్వీట్ చేశారు.


క్రిష్ జాగర్లమూడి తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా.. ఇద్దరు గొప్ప దిగ్గజాల ద్వారా హరిహర వీరమల్లు ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాడు. నిశ్శబ్దంగా కాదు.. ఉద్దేశంతోనే.. ప్రతి ఫ్రేమ్ వెనుక చరిత్ర బరువు స్పష్టంగా కనిపిస్తోంది. సినిమాలో మాత్రమే కాదు ఆత్మలో కూడా.. పవన్ కళ్యాణ్ అంతకన్నా గొప్ప శక్తి ద్వారా ఆశీర్వదించబడిన వ్యక్తి. ఏదో తెలియని అసాధారణ శక్తి, ఆయనలో ఏ కెమెరా పూర్తిగా సంగ్రహించలేని ఒక అగ్ని ఉంది. ఉద్దేశం నుండి వచ్చే ఒక రకమైన శక్తి అది. ఆయన నిత్యం మండే సూర్యుడు లాంటివాడు.  హరిహర వీరమల్లుకి ప్రాణం పోసింది ఆయనలోని ఆ కొత్త శక్తి మాత్రమే. హరిహర వీరమల్లు చిత్రానికి వెన్నెముకగా నిలవడమే కాకుండా ఆత్మ గా మారి  తుఫానును అందించారు. ఇక ఈ సినిమా నా అత్యంత ఉత్సాహభరితమైన పోరాటాలలో ఒకటి. దర్శకుడిగా మాత్రమే కాకుండా మరిచిపోయిన చరిత్రను అన్వేషించే వాడిగా నన్ను రూపుదిద్దింది. అసౌకర్య సత్యాలను అన్వేషించే వాడిగా.. ప్రపంచ నిర్మాణానికి పునాది వేసే అవకాశం నాకు కల్పించినట్లుగా అనిపిస్తోంది. ప్రపంచ నిర్మాణానికి ఈ సినిమా ఖచ్చితంగా పునాది వేస్తుందని భావిస్తున్నాను. ముఖ్యంగా అటు ఏ.ఎం రత్నం కి ఇటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటూ క్రిష్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: