
చిత్ర విచిత్రమైన కాస్ట్యూమ్‌స్ వేసుకుంటూ జనాలలో ఎలాంటి జంకు లేకుండా తిరుగుతూ సెలబ్రిటీగా మారిపోయింది బాలీవుడ్ బ్యూటీ ఊర్ఫీ జావేద్. హిందీ బిగ్ బాస్ ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకున్న ఈ మధ్యప్రదేశ్ అమ్మాయి ధరించే వెరైటీ వెరైటీ దుస్తులు చాలా ఫన్నీగా ఉంటాయి . కొంతమంది ఆమె వేసుకునే దుస్తుల గురించి పొగిడితే మరి కొంతమంది బూతులు తిడుతూ ఉంటారు . ఒళ్ళంతా కనిపించేలా బట్టలు ఏంటి..?? అంటూ ఎన్నోసార్లు పబ్లిక్ లో మండిపడ్డ సందర్భాలు ఉన్నాయి . ఆమె దుస్తులకే సపరేట్ గా ఫ్యాన్స్ ఉన్నారు అని చెప్పుకోవడంలో సందేహమే లేదు . అలాంటి ఊర్ఫీ జావేద్ తాజా ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.
అసలు అందులో చూస్తున్నది మనం ఊరిఫీ నేనా అని అనిపించేలా గుర్తుపట్టలేని స్థితికి మారిపోయింది . లిప్ ఫిల్లర్స్ ని ట్రై చేసింది . అది బెడిసి కొట్టడంతో పెదాలు దారుణంగా మారిపోయాయి . తాజాగా వాటిని మరొక డాక్టర్ సహాయంతో తీసి వేయించుకుంది . ఇందుకు సంబంధించిన వీడియోను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఇలాంటి పని ఎవరు చేయొద్దు అంటూ సజెస్ట్ చేసింది . ఆ వీడియోకి ఇది ఫిల్టర్ కాదు అంటూ క్యాప్షన్ ఇవ్వగా తెగ వైరల్ అవుతుంది. అందులో కనిపించిన ఊర్ఫీని పూర్తిగా మారిపోయిన రూపంలో మనం చూడవచ్చు .
ఆమెను చూసినవాళ్లు గుర్తుపట్టలేకపోయారు. ఇది నిజంగా నువ్వేనా..?? లేకపోతే ఏదైనా సోషల్ మీడియాలో ఫిల్టర్స్ యూస్ చేసావా..?? అంటూ మొదటి సందేహ పడ్డారు. ఆ తర్వాత పూర్తిగా వివరించడంతో అందరూ ఇలాంటి తప్పుడు పని చేయకుండా ఉండాల్సింది అంటూ సజెస్ట్ చేశారు . "ఫేస్ ఫిల్లర్స్ ని తీసేయడం ఎంత బాధాకరమో అంతే అవసరం కూడా ఉంది. ఇది చాలా బాధతో కూడిన ప్రక్రియ . అయినా సరే మళ్లీ సహజంగా ఉండేలా వేయించుకుంటా . నేను ఫిల్లర్స్ కి వ్యతిరేకం అనుకోకండి కానీ మంచి డాక్టర్ దగ్గర వేయించుకోవడం చాలా ముఖ్యం . మోసపూరిత క్లినిక్ లో వేయించుకోవడం వల్ల నాకు ఇలాంటి పరిస్థితి ఎదురైంది. మీరు ఇలాంటి పరిస్థితిని తెచ్చుకోకండి . మంచి డాక్టర్ దగ్గర మాత్రమే ఫేస్ పిల్లర్స్ వేయించుకోండి అంటూ ఇంస్టాగ్రామ్ లో రాసుకొచ్చింది.
"అంతేకాదు మీరు బ్యూటీ ట్రీట్మెంట్లు చేయించుకోవాలి అనుకున్నప్పుడు ఒక సర్టిఫైడ్ , నిపుణులైన డాక్టర్లు మాత్రమే సంప్రదించండి అంటూ చెప్పుకొచ్చింది". ఇలాంటి వాటి పట్ల ధైర్యంగా అవగాహన కల్పించినందుకు చాలా మంది ఆమెను ప్రశంసితున్నారు. ఫేస్ పిల్లర్స్ అనేది చర్మంలోని లోతైన గీతలు .. అదేవిధంగా ముడతలు తగ్గించడానికి ఉపయోగిస్తూ ఉంటారు . ఫేస్ వాల్యూమ్ పునరుద్ధరించడానికి అలాగే ముఖం యొక్క ఆకృతిని మెరుగుపరచడానికి రకరకాల పద్ధతులు ఉపయోగిస్తూ ఉంటారు . వీటిని థర్మల్ ఫిల్లర్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు..!