సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ మనం అనుకున్నట్లుగానే టైం టు టైం జరిగిపోవు. అది అందరికీ తెలిసిందే. కొన్ని సార్లు మనం ఊహించని విషయాలు కూడా జరుగుతాయి. అలాంటి సందర్భాల్లో మనం చాలా చక్కగా, పక్కాగా ప్లాన్‌ తో ముందుకు వెళ్లాలి. లేకపోతే ఏదైనా తప్పు నిర్ణయం తీసుకున్నా ఇన్నాళ్లుగా కష్టపడి సంపాదించుకున్న పేరు, ప్రతిష్ట మొత్తం డౌన్‌ఫాల్‌ అవుతుంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఆ విషయంలో సరైన నిర్ణయం తీసుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. మనకు తెలిసిందే, జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ ప్రాజెక్ట్‌ వార్ 2.  అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో హృతిక్ రోషన్ హీరోగా నటించగా, జూనియర్ ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో కనిపించారు.
 

సినిమా ఆగస్టు 14న బాక్స్ ఆఫీస్ వద్ద రిలీజ్ అయి మిక్స్‌డ్ టాక్‌ సంపాదించుకుంది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్‌కి మంచి మార్కులు పడగా, ఓవరాల్‌గా మాత్రం సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. ప్రత్యేకంగా తెలుగులో ఈ సినిమాను ప్రేక్షకులు పెద్దగా ఆదరించకపోవడంతో కలెక్షన్స్ పరంగా డల్‌గా మారిపోయింది. "వార్ 2" మూవీపై వస్తున్న నెగిటివ్ టాక్.. అలాగే ఆయనపై జరుగుతున్న ట్రోలింగ్ కారణంగా.. జూనియర్ ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమా షెడ్యూల్‌ను పోస్ట్‌పోన్‌ చేసి ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెకేషన్‌కి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇదే వార్త ఇప్పుడు తెలుగు మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.



సోషల్ మీడియాలో మాత్రం ఒక బ్యాచ్ కావాలనే జూనియర్ ఎన్టీఆర్‌ను టార్గెట్ చేస్తూ, ఆయన పర్సనల్ విషయాలను పదే పదే లేవదీస్తూ, "వార్ 2" ఫ్లాప్ టాక్‌ను మరింతగా హైలైట్ చేస్తున్నారు. ఇండియాలో ఉంటే ఇలాంటి వాటిని ఎక్కువగా ఎదుర్కోవాల్సి వస్తుందని భావించి.. వెకేషన్ పేరుతో ఫ్యామిలీతో కలిసి వేరే దేశానికి వెళ్ళాలని, అందుకే ముఖ్యమైన షెడ్యూల్‌ను కూడా రద్దు చేసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: