మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ నటిమని రెజీనా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె 2012 వ సంవత్సరం విడుదల అయినటువంటి శివ మనసులో శృతి (ఎస్ఎంఎస్) అనే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది. అలాగే ఈ మూవీ లో ఈమె తన నటనతో , అందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దానితో ఈ సినిమా ద్వారా ఈమెకి మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత కూడా ఈమె తను నటించిన సినిమాల్లో తన అందాలతో , నటనలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈమె తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన స్థాయికి చేరుకుంటుంది అని చాలా మంది భావించారు.

కానీ ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకోలేకపోయింది. కానీ ఈమె తెలుగులో మంచి గుర్తింపును మాత్రం సంపాదించుకుంది. ఇప్పటికి కూడా ఈమె వరుస సినిమాలలో నటిస్తూ అద్భుతమైన రీతిలో కెరియర్ను ముందుకు సాగిస్తుంది. తాజాగా రెజినా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూ లో భాగంగా తమిళ నటుడు అయినటువంటి శివ కార్తికేయన్ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

అసలు విషయం లోకి వెళితే  ... తాజా ఇంటర్వ్యూ లో భాగంగా రెజీనా మాట్లాడుతూ ... నేను , శివ కార్తికేయన్ కలిసి  కేడీ బిల్లా.. కిల్లాడి రంగా సినిమాలో నటించాం. ఈ సినిమా విడుదలై ఇప్పటికే 12 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఆ మూవీ విడుదల అయి పన్నెండు సంవత్సరాలు అవుతున్న అప్పుడు  శివకార్తికేయన్ ఎలా ఉన్నాడో ఇప్పటికి కూడా అలాగే ఉన్నాడు. ఆయనలో ఇప్పటికి కూడా  ఎలాంటి మార్పు లేదు. శివ కార్తికేయన్ ను ఏ టైమ్ లో చూసినప్పుడు ఇంత పెద్ద హీరో అవుతాడని అనుకోలేదు. ఎందుకు అంటే  సినిమా రంగం అనేది ఎంతో కష్టంతో కూడింది. అయినా శివ కార్తికేయన్ ఇంత పెద్ద స్టార్ ఎలా అయ్యారో, ఏం చేశారో కూడా నాకు తెలియదు అని తాజా ఇంటర్వ్యూలో భాగంగా రెజీనా చెప్పుకొచ్చింది. తాజాగా రెజీనా చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: