
ఇప్పటికి పవన్ కళ్యాణ్ OG, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి ప్రాజెక్టులతో టాలీవుడ్ మొత్తాన్ని కదిలిస్తున్నారు. ఇటీవల OG మూవీ కోసం ఆయనకు దాదాపు రూ.100 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చారనే వార్తలు వస్తున్నాయి. సెప్టెంబర్ 25న విడుదల కానున్న ఈ సినిమా ఇప్పటికే బిజినెస్ పరంగా రికార్డులు సృష్టిస్తోంది. సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీకి ఇమ్రాన్ హష్మి విలన్‌గా, ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. సుమారు రూ.250 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా పవన్ కెరీర్‌లో మరో హైప్ క్రియేట్ చేస్తోంది. అంతే కాకుండా హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ కోసం పవన్ కళ్యాణ్ అక్షరాలా రూ.172 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం. ఇది నిజమైతే టాలీవుడ్ చరిత్రలోనే కాకుండా, భారతీయ సినిమా చరిత్రలో కూడా ఒక రికార్డు అవుతుంది.
ఇప్పటివరకు ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి పాన్ ఇండియన్ స్టార్లు రూ.100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకున్నా, ప్రాంతీయ భాషా సినిమాలో ఒక హీరోకు రూ.172 కోట్ల పారితోషికం ఇవ్వడం నిజంగా సంచలనమే. పవన్ కళ్యాణ్ సినీ కెరీర్‌తో పాటు రాజకీయ రంగంలో కూడా సత్తా చాటుతున్నారు. నేడు ఆయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా ప్రజాసేవలో ఉన్నప్పటికీ, సినిమాల పట్ల అభిమానాన్ని వదల్లేదు. సమయం దొరికినప్పుడల్లా సినిమాలు చేస్తూ, అభిమానుల్లో కొత్త జోష్ నింపుతున్నారు. అంటే చెప్పాలంటే – చిన్న రెమ్యూనరేషన్‌తో మొదలైన పవన్ జర్నీ, నేడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ రికార్డు వైపు దూసుకెళ్తోంది. OG, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల తర్వాత పవన్ మరిన్ని ఏ రికార్డులు సృష్టిస్తారో టాలీవుడ్ ఆసక్తిగా ఎదురు చూస్తోంది.