సాధారణంగా మనకు ఇష్టమైన హీరోని పెద్ద తెరపై చూస్తేనే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. థియేటర్లలో వారి ఎంట్రీకి కేకల వర్షం కురుస్తుంది, సీటు ఎడ్జ్‌పై కూర్చోబెడుతుంది. అయితే ఒకవేళ ఇద్దరు బిగ్ స్టార్ హీరోలు, పైగా పాన్-ఇండియా స్థాయిలో తమదైన క్రేజ్ సంపాదించిన సూపర్ స్టార్స్ ఒకే తెరపై కనిపిస్తే ఆ ఎక్సైట్మెంట్, ఆ క్రేజీ కిక్ అసలే వేరే లెవెల్‌లో ఉంటుంది. ఆ అనుభూతి ఆస్వాదించిన అభిమానులకే ఆ ఫీలింగ్ ఏంటో పూర్తిగా అర్థమవుతుంది. అలాంటి మైండ్-బ్లోయింగ్ అనుభవాన్ని తెలుగు సినిమా ప్రేక్షకులు ఇటీవల రామ్ చరణ్జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ఆస్వాదించారు.
 

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టించి, తెలుగు సినిమా స్థాయిని గ్లోబల్ లెవెల్‌లోకి తీసుకెళ్లింది. ప్రారంభంలో రాజమౌళి ఇద్దరు స్టార్ హీరోలను ఒకే సినిమాలో తీసుకొని ఏ విధంగా న్యాయం చేస్తాడో అని చాలామంది సందేహాలు వ్యక్తం చేశారు. కానీ ఆ సినిమా విడుదలైన తర్వాత ఆయన అందరి అంచనాలను మించి అందరినీ మంత్రముగ్ధులను చేశారు. చరణ్ – తారక్ పాత్రలు, వారి మధ్య కెమిస్ట్రీ, యాక్షన్ సీన్స్, పాటలు… అన్నీ ప్రేక్షకులను థియేటర్లలో కేకలు వేయించేలా చేశాయి. ఆ సినిమా తర్వాత వీరిద్దరూ మళ్లీ కలిసి కనిపించాలని అభిమానులు సోషల్ మీడియాలో విపరీతమైన క్యాంపెయిన్స్ కూడా చేశారు. “మళ్లీ ఒక సినిమా కాంబినేషన్‌లో రావాలి”, “తారక్-చరణ్ మ్యాజిక్ మిస్ అవుతున్నాం” అంటూ వేలాదిగా కామెంట్లు వచ్చాయి. అయితే ఇన్నాళ్లుగా అభిమానులు కోరుకున్న కోరిక కొంతవరకు నెరవేరబోతుందనిపిస్తోంది. తాజా వార్తల ప్రకారం ఈసారి చరణ్ – తారక్ కాంబోలో కనిపించేది సినిమా కోసం కాదు, ఒక బిగ్ ఇంటర్నేషనల్ బ్రాండ్ యాడ్ కోసం అని తెలుస్తోంది.



ఈ భారీ కమర్షియల్‌ యాడ్ ను సుకుమార్ డైరెక్ట్ చేస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ కాంబినేషన్‌లో సినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ యాడ్ న్యూస్ మాత్రం నిజంగా గుడ్ న్యూస్‌గానే మారింది. సోషల్ మీడియాలో ఈ వార్త ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. ఫ్యాన్స్ అయితే “ఇది కేవలం ఒక నిమిషం యాడ్ మాత్రమే ..అలా కాకుండా సినిమా లాంటి అనుభూతిని ఇస్తే బాగుంటుంది” అంటున్నారు.  “ఈ ఇద్దరు స్క్రీన్‌పై కనిపిస్తే ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ అవుతుందో మళ్లీ చూడబోతున్నాం” అంటూ ఎగ్జైటెడ్‌గా కామెంట్లు చేస్తున్నారు.



అయితే అభిమానుల అసలు కల మాత్రం ఈ జంట మళ్లీ ఒక పాన్-వరల్డ్ మూవీలో కలిసి రావడం. “ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ – తారక్ కాంబినేషన్‌లో మరో సినిమా వస్తే గ్లోబల్ రికార్డులు మళ్లీ బద్దలవుతాయి” అని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. “ఈ యాడ్‌తో మొదలైన కాంబినేషన్ మ్యాజిక్ త్వరలో ఓ భారీ సినిమా రూపంలో రావాలి” అనే కోరికలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ యాడ్ గురించి వచ్చిన అప్‌డేట్ అభిమానుల హృదయాల్లో మళ్లీ కొత్త ఉత్సాహాన్ని నింపింది. చరణ్ – తారక్ అభిమానులు, అలాగే తెలుగు సినిమా ప్రేక్షకులు ఈ ఇద్దరు గ్లోబల్ స్టార్ హీరోలను మళ్లీ కలిసి చూడటానికి ఎదురుచూస్తూ ఆసక్తిగా ఉన్నారు. మరి ఈ కాంబినేషన్‌తో సినిమా ఎప్పుడు రానుందో చూడాలి కానీ అప్పటివరకు ఈ యాడ్‌తో అభిమానులు తమ స్టార్ హీరోల జోడీని ఎంజాయ్ చేయబోతున్నారు అనడంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: