పాన్ ఇండియా హీరో ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా హర్రర్ థ్రిల్లర్ చిత్రం" ది రాజా సాబ్". ఈ చిత్రం వాస్తవానికి డిసెంబర్లోనే ఈ ఏడాది రిలీజ్ కావాల్సి ఉండగా కొన్ని కారణాల చేత వచ్చేయేడాది సంక్రాంతికి వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. ప్రభాస్ కెరియర్ లోనే మొదటిసారిగా ఇలాంటి హర్రర్ జోనర్ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో కామెడీ సన్నివేశాలు కూడా ఉండబోతున్నాయి. గత కొద్దిరోజులుగా ఈ సినిమా బడ్జెట్ పైన పలు రకాల రూమర్స్ వినిపిస్తూ ఉండడంతో తాజాగా డైరెక్టర్ మారుతి అసలు బడ్జెట్ ఎంతో క్లారిటీ ఇచ్చారు.


తాజాగా బ్యూటీ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన డైరెక్టర్ మారుతి ఇందులో మాట్లాడుతూ.. డైరెక్టర్ అనేవారు చాలా క్రియేటివ్ గానే ఆలోచిస్తూ ఉంటారు. ప్రభాస్ కు నా మీద చాలా నమ్మకం ఉంది కాబట్టి ఈ సినిమాకి తనకు అవకాశం ఇచ్చారని.. రూ.400 కోట్ల రూపాయల బడ్జెట్ తో రాజా సాబ్ సినిమా తీస్తున్నానని తెలిపారు. ఈ సినిమా అభిమానులు ఊహించని విధంగా అదిరిపోతుందని తెలిపారు. ప్రభాస్ కు నాకు ఎంతో మంచి  స్నేహబంధం ఉంది. ఇద్దరము కూడా చాలా ఆప్యాయంగానే మాట్లాడించుకుంటామంటూ తెలిపారు.


ప్రభాస్ అభిమానులను ఎక్కడ నిరాశపరిచేలా ఈ సినిమా ఉండదంటూ ఖచ్చితంగా చెప్పగలనని ధీమా ఉందంటూ తెలిపారు మారుతి.. చాలా చిత్రాలలో బూతులు ఉంటేనే సినిమాలు చూస్తున్నారని అయితే అవి మంచివి కావు కుటుంబం మొత్తం చూసేలా సినిమా ఉండాలి అంటు తెలియజేశారు డైరెక్టర్ మారుతి. మొత్తానికి బడ్జెట్ పైన వినిపిస్తున్న రూమర్స్ కి ఈ విధంగా క్లారిటీ ఇచ్చారు. పీపుల్స్ మీడియా బ్యానర్ పైన ఈ సినిమాని భారీ బడ్జెట్లోనే నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్స్ గా నిధి అగర్వాల్, మాళవిక మోహన్, రిద్ది కుమార్, సంజయ్ దత్ తదితరులు నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: