ఏంటి ఎన్టీఆర్ కి గాయం అవ్వడానికి కారణం మంచు మనోజేనా..మంచు మనోజ్ వల్లే ఎన్టీఆర్ గాయపడ్డారా.. ఇంతకీ ఎందుకు మనోజ్ ఎన్టీఆర్ కి గాయం చేశారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. ఎన్టీఆర్ కి అయిన గాయం మనోజ్ వల్లే అంటే చాలామంది నెటిజన్లు రీసెంట్గా జూనియర్ ఎన్టీఆర్ ఓ యాడ్ షూటింగ్ లో పాల్గొన్న సమయంలో గాయపడ్డాడు కాబట్టి ఆ గాయం మంచు మనోజ్ వల్లే జరిగిందని అనుకుంటారు.అయితే అలా అనుకుంటే పొరపాటు పడ్డట్లే.  ఇక యాడ్ షూటింగ్లో పొరపాటున ఎన్టీఆర్ కి దెబ్బలు తగిలాయి. కానీ దానికి మంచు మనోజ్ కి ఎలాంటి సంబంధం లేదు. మరి మంచు మనోజ్ వల్ల ఎన్టీఆర్ ఎప్పుడు గాయపడ్డారు అనేది చూస్తే.. మంచు మనోజ్ తాజాగా మిరాయ్ మూవీ హిట్ తో మంచి జోష్ లో ఉన్నాడు. ఈ సినిమా హిట్ అవ్వడంతో మనోజ్ కి ఇండస్ట్రీవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. 

అంతే కాదు ఈ సినిమాలో తన విలనిజంతో మనోజ్ అదరగొట్టడంతో చాలామంది స్టార్ హీరోలు సైతం తమ సినిమాల్లో మంచు మనోజ్ ని విలన్ గా తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అలా ఒక హీరో ఒక్కసారిగా విలన్ గా నటించేసరికి ఆయన విలనిజానికి ఎంతో మంది ఫిదా అయిపోయారు. ఇక మనోజ్ కూడా తండ్రి లాగే కొన్ని సినిమాల్లో హీరోగా చేసి విలన్ గా కూడా మెప్పించారు.మోహన్ బాబు అటు హీరోగా ఇటు విలన్ గా రెండు పాత్రల్లో అదరగొట్టగలరు. మంచు మనోజ్ కూడా తండ్రికి తగ్గ తనయుడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

ఇదంతా పక్కన పెడితే మిరాయ్ మూవీ హిట్ తో తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న మంచు మనోజ్ షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు.చిన్నతనంలో ఎన్టీఆర్ నేను మంచి స్నేహితులుగా ఉన్నాం. అయితే ఓసారి సరదాగా కార్లో వెళ్తున్న టైంలో కారులో బెలూన్ అంటించగా అది కాలిపోయి ఎన్టీఆర్ చేతికి గాయం అయింది. అయితే ఆ గాయం తాలూకు మచ్చ చూసినప్పుడల్లా నాకు చాలా గిల్టీగా అనిపిస్తుంది.ఎందుకు అలా చేశానని చాలాసార్లు బాధపడతాను అంటూ మనోజ్ ఆ పాడ్ కాస్ట్ లో ఎమోషనల్ అయ్యారు. అంతేకాకుండా ఇప్పటినుండి కేవలం హీరోగా విలన్ గా మాత్రమే కాకుండా ప్రాధాన్యత ఉన్న పాత్రలు వస్తే కచ్చితంగా అన్ని సినిమాల్లో నటిస్తాను అంటూ మంచు మనోజ్ చెప్పుకొచ్చారు

మరింత సమాచారం తెలుసుకోండి: