
ఈ సినిమాలో హీరోగా నటించిన తరుణ్ అప్పటివరకు బాలనటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ “నువ్వే కావాలి”తో అతనికి కొత్త గుర్తింపు వచ్చింది — లవర్ బాయ్ తరుణ్ గా మారిపోయాడు. అతని సహజమైన నటన, అమాయకత్వం, చక్కని స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. హీరోయిన్గా రిచా కూడా తన అందం, సహజమైన నటనతో ఈ సినిమాకి మరింత అందం జోడించింది . సంగీత దర్శకుడు కోటి అందించిన పాటలు ఇప్పటికీ హృదయాలను హత్తుతూనే ఉన్నాయి. ఆ మ్యూజిక్ అప్పట్లో యువతను ఉర్రూతలూగించింది. మొత్తం 3 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా, విడుదలయ్యాక భారీ విజయాన్ని సాధించింది. ఆ సమయంలోనే ఈ సినిమా 24 కోట్లకు పైగా వసూలు చేయడం విశేషం. అంటే దాదాపు ఎనిమిది రెట్లు లాభం! ఇది ఆ కాలంలో సెన్సేషన్ అని చెప్పాలి.ఇక టీవీల్లో ఈ సినిమా ప్రసారం అయిన ప్రతీసారి కూడా రేటింగ్స్‌లో టాప్‌లో నిలుస్తుంది. ఇప్పటికీ చాలామంది ఈ సినిమాని ప్రేమతో మళ్లీ మళ్లీ చూస్తుంటారు.
కానీ అసలు సీక్రెట్ ఏమిటంటే… ఈ సినిమా హీరోగా మొదట ఎవరు అనుకున్నారో తెలుసా? ఇది చాలా మందికి తెలియని విషయం. “నువ్వే కావాలి” సినిమాలో హీరోగా మొదట మహేష్ బాబును అనుకున్నారట! ఆ సమయంలో ఆయన “రాజకుమారుడు” సినిమా రిలీజ్ అయి, “యువరాజు” షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. మేకర్స్ స్క్రిప్ట్ పంపించి, రెండు నెలల పాటు రెస్పాన్స్ కోసం ఎదురుచూశారట. కానీ మహేష్ నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో, తదుపరి ఎంపికగా సుమంత్ ని అనుకున్నారు.
కానీ అప్పటికే సుమంత్ “యువకుడు”, “పెళ్లి సంబంధం” వంటి సినిమాలతో బిజీగా ఉండటంతో, ఆయన కూడా చేయలేకపోయాడు.ఆ తర్వాత చాలా మంది యువ హీరోలను పరిశీలించిన నిర్మాత రవి కిషోర్ చివరికి కొత్తవారితో సినిమా తీయాలని నిర్ణయించాడు.తరుణ్ ఒక వ్యాపార ప్రకటనలో కనిపించగా, అతని ముఖంలో ఉన్న అమాయకత్వం చూసి మేకర్స్ వెంటనే ఇంప్రెస్ అయ్యారు. అలా “నువ్వే కావాలి”లో హీరో ఛాన్స్ అతనికి దక్కింది. తరుణ్ ఆ అవకాశాన్ని బంగారం చేసుకున్నాడు. నిజంగా ఈ సినిమా అతనికి జీవితాన్ని మార్చేసింది అని చెప్పక తప్పదు.
“నువ్వే కావాలి” అనేది కేవలం ఒక సినిమా కాదు, అది ఓ జ్ఞాపకం. 2000ల ప్రారంభంలో యువత ప్రేమని, భావోద్వేగాలని ఎమోషనల్‌గా చూపించిన అద్భుతమైన ప్రేమకథ. 25 ఏళ్లు గడిచినా ఈ సినిమా మ్యాజిక్ మాత్రం ఎప్పటికీ తగ్గలేదు. అప్పటి ప్రేక్షకులకే కాదు, కొత్త తరం యువతకీ ఇప్పటికీ ఫీల్ గుడ్ క్లాసిక్. మొత్తానికి “నువ్వే కావాలి” అనేది తెలుగు సినీ చరిత్రలో ఒక లవ్ మైలురాయి. మరి ఆ క్లాసిక్‌లో హీరోగా ఉండే అవకాశం వదులుకున్న మహేష్ బాబుకి ఈ సినిమా చూసిన తర్వాత ఏమనిపించిందో ఎవరికీ తెలియదు కానీ, ప్రేక్షకుల హృదయాల్లో మాత్రం ఈ సినిమా ఎప్పటికీ "తరుణ్" నువ్వే కావాలి అనే పేరుతో నిలిచిపోయింది!