శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇంచార్జ్ అయిన కోటా వినుత, ఆమె భర్త చంద్రబాబు డ్రైవర్ రాముడు హత్య కేసులో ఆరోపణల నేపథ్యంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో నిన్నటి రోజు నుంచి ఒక సంచలన ట్విట్ చోటు చేసుకుంది. రాయుడు హత్యకాకముందు ఒక సెల్ఫీ వీడియో నిన్నటి రోజున వైరల్ కావడంతో మరొకసారి వార్తలలో నిలిచారు. ఇదంతా కూడా శ్రీకాళహస్తి ప్రస్తుత ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చుట్టూనే తిరుగుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా వినుత, ప్రైవేట్ వీడియోలు పంపించాలని అందుకు రూ .30 లక్షల రూపాయలు డ్రైవర్ రాయుడుకి ఇస్తానని చెప్పారంటూ వినుత డ్రైవర్ ఒక సెల్ఫీ వీడియో నిన్నటి రోజున వెలుగులోకి వచ్చింది.


ఇలాంటి సందర్భంలోనే ఈరోజు వినుత ఒక సెల్ఫీ వీడియోని విడుదల చేస్తూ ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. మనసు నిండా పుట్టాడు బాధ ఉన్నప్పటికీ, చేయని తప్పుకు జైలుకు వెళ్లిన బాధ లేదు,కాని మేము చంపామంటూ ప్రచారం చేయడం చాలా బాధగా అనిపించిందంటూ తెలియజేసింది. రాయుడు చావులో మా ప్రమేయం లేదంటూ కోర్టు కూడా భావించింది కాబట్టే, తమకు 19 రోజులలోని బెయిల్ వచ్చిందంటూ తెలియజేసింది.


నెల రోజుల్లోనే కేసులో ఉన్న వారందరికీ కూడా బెయిల్ వచ్చిందంటూ వినుత తెలియజేసింది. విదేశాల నుంచి లక్షల రూపాయల జీతం వదులుకొని మరి ప్రజా సేవ చేయాలని రాజకీయాలలోకి వచ్చాము, మనుషులు ప్రాణాలను తీసేందుకు కాదు. అలాంటి మనస్తత్వం మాది కాదంటూ తెలియజేసింది. ఎలాంటి సంబంధం లేదని ఈ కేసులలో తమకు క్లీన్ చిట్ తో తాను బయటికి వస్తామంటు చాలా ధీమాగా తెలియజేసినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ కేస్ కు సంబంధించి చెన్నై కోర్టులో విచారణ జరుగుతున్నందువలన ఎక్కువగా మాట్లాడలేనని తాను మాత్రం ఏ తప్పు చేయలేదు , అన్ని నిజాలు ఆ శివయ్యకే తెలుసు ధైర్యంగా పోరాడుతాం అంటూ తెలియజేసింది. ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను కలవడానికి ప్రయత్నిస్తున్నామని అందుకే మీడియా ముందుకు రాలేకపోతున్న త్వరలోనే అన్ని ఆధారాలతో మీడియా ముందుకు వస్తామంటూ తెలియజేసింది. ప్రస్తుతం కోట వినుత షేర్ చేసిన ఈ వీడియో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: