బాలీవుడ్ లో స్పెషల్ సాంగ్ లు చేస్తూ ఆఫర్స్ అందుకుంటున్న తమన్నా రీసెంట్ గా స్త్రీ 2 మూవీలో చేసిన ఆజ్ కీ రాత్ అనే సాంగ్ ద్వారా చాలామంది పిల్లలకి కూడా నేను తెలిసిపోయాను. కొంతమంది అయితే మీ పాట చూడందే మా పిల్లలు నిద్రపోవడం లేదు, అన్నం తినడం లేదు..మీ పాట పెట్టి మా పిల్లల్ని నిద్ర పుచ్చుతున్నాం అని చెబుతున్నారు అంటూ ఆ మధ్యకాలంలో తమన్నా చెప్పిన సంగతి మనకు తెలిసిందే. అయితే తమన్నా చెప్పినట్లు ఆజ్ కీ రాత్ పాటలో తమన్నా అద్భుతంగా చేసింది.ఈ పాట చూస్తే ఎవరైనా సరే స్టెప్పులు వేయాల్సిందే నిద్రలోకి జారాల్సిందే. ఇదిలా ఉంటే తమన్నా మాట్లాడిన ఈ మాటలపై బాలీవుడ్ సీనియర్ నటుడు అన్ను కపూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.తమన్నా ఆరోజు తన పాట చూసి చిన్న పిల్లల్ని నిద్రపుచ్చుతున్నారు అని చెప్పింది.అయితే ఏ వయసులో ఉన్న పిల్లల్ని నిద్రపుచ్చుతున్నారు. 

70 ఏళ్ల వయసులో ఉన్న ముసలి వాళ్లు కూడా పిల్లలతోనే సమానం కదా.. ఒకవేళ నేను అక్కడ ఉంటే తమన్నా ని ఇదే ప్రశ్న అడిగేవాడిని.వావ్ తమన్నా ది ఎంత అద్భుతమైన పాల లాంటి శరీరం.నీ బాడీ వల్ల, పాల లాంటి శరీరం వల్ల ఎంతోమందిని నిద్రపుచ్చుతున్నావు చిన్నపిల్లలే కాదు 70 ఏళ్ల ముసలోళ్ళు కూడా నీ పాట చూసి పడుకుంటారు. అనే విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.అయితే బాలీవుడ్ సీనియర్ నటుడు అన్ను కపూర్ వ్యాఖ్యలపై చాలామంది నెటిజన్స్ మండి పడుతున్నారు.

బాలీవుడ్ లో సీనియర్ నటుడి హోదాలో ఉన్న మీరు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు మరి కొంతమందేమో నీ ఇంట్లో వాళ్ళని ఇలాగే అంటావా.. కనీసం నీ వయసుకు తగ్గట్టు అయిన మాట్లాడు అంటూ మండి పడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ తమన్నా బాడీ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అన్ను  కపూర్ పై చాలామంది ఫైర్ అవుతున్నారు.మరి అన్ను కపూర్ చేసిన ఈ వ్యాఖ్యలపై తమన్నా స్పందిస్తుందా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: