
ఇప్పుడు ఓజీ తర్వాత పవన్ కళ్యాణ్ రెండు కొత్త సినిమాలకు కమిట్ అయినట్లు సమాచారం. ఇప్పటికే హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఉస్తాత్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ రేంజ్‌లో ఉంటుందని టాక్. దానికి ప్రధాన కారణం హరీశ్ శంకర్ ..పవన్ కోసం ప్రత్యేకంగా రాసిన పవర్‌ఫుల్ స్క్రీన్‌ప్లే.ఇప్పుడు పవన్ కొత్తగా ఇద్దరు డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అందులో ఒకరు సురేందర్ రెడ్డి. ఆయన దర్శకత్వంలో పవన్ హీరోగా ఒక సినిమా కోసం పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. పవన్ సన్నిహితుడు రామ్ తాళ్లూరి ఈ సినిమాకు నిర్మాత. ఈ ప్రాజెక్ట్‌ను తిరిగి రివైవ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పవన్, తనకు సమయం దొరికినప్పుడు ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారని టాక్.మరొకవైపు, తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్‌తో కూడా పవన్ ఒక సినిమా చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇటీవల లోకేష్ దర్శకత్వంలో వచ్చిన కూలి సినిమా పెద్ద స్థాయి హిట్ కాకపోయినా మంచి పాజిటివ్ టాక్ సంపాదించింది. పవన్ కళ్యాణ్ కూడా లోకేష్ సినిమాలను ఆసక్తిగా ఫాలో అవుతారట. అందుకే ఆయన దర్శకత్వంలో ఒక సినిమా చేయాలనే ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది.
లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో ఓ ప్రాజెక్ట్‌ను సెట్ చేయడానికి ప్రయత్నాలు వేగంగా జరుగుతున్నాయని ఫిలింనగర్ టాక్. ఒకవేళ ఈ ఇద్దరు డైరెక్టర్ల ప్రాజెక్ట్‌లు కుదిరితే పవన్ కళ్యాణ్ సినిమాటిక్ షెడ్యూల్ మొత్తం ఫిక్స్ అయినట్టే అంటున్నారు.ఫ్యాన్స్ మాత్రం స్పష్టంగా చెబుతున్నారు . పవన్ కళ్యాణ్ ఒకసారి సినిమా ఫిక్స్ అయితే ఎప్పటికైనా దాన్ని పూర్తి చేస్తాడని. రాజకీయాల బిజీ మధ్యనైనా, ఆయన తెరపై తిరిగి కనిపించడం ఫ్యాన్స్‌కు నిజమైన దీపావళి పండుగేనని అందరూ అంటున్నారు.పవన్ కళ్యాణ్ ఇస్ బ్యాక్ అంటూ హ్య్స్ష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి..!