- ( గ్రేట‌ర్ హైద‌రాబాద్ - ఇండియా హెరాల్డ్ ) . . .

తెలంగాణ రాజ‌ధాని గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలోని జూబ్లిహిల్స్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి వ‌చ్చే నెల‌లో ఉప ఎన్నిక జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ జూబ్లీహిల్స్ బైఎలక్షన్‌ను అటు అధికార కాంగ్రెస్ పార్టీ తో పాటు ఇటు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న బీఆర్ఎస్ రెండు పార్టీలు సీరియ‌స్ గా తీసుకున్నాయి. ఇక ఈ ఉప ఎన్నిక‌ను సీరియస్‌గా తీసుకున్న సీఎం రేవంత్‌ ఇప్పటికే ముగ్గురు మంత్రులకు బాధ్యతలు ఇచ్చారు. తెలంగాణ కేబినెట్ లో మంత్రులు పొన్నం ప్రభాకర్‌, వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వరావులు జూబ్లీహిల్స్‌లో విస్తృతంగా పర్యటిస్తు కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు స‌ర్వ శ‌క్తులు ఒడ్డుతున్నారు. అయితే ఉప ఎన్నిక ఇంచార్జీలుగా ఉన్న ఆ ముగ్గురు మంత్రుల పనితీరుపై సీఎం రేవంత్ సంతృప్తిగా లేరని కాంగ్రెస్ వ‌ర్గాలే చెవులు కొరుక్కుంటున్నాయి. దీంతో లాభం లేదని తానే స్వయంగా రంగంలోకి దిగాలనుకుంటున్నారట. తాను ఎక్స్‌పెక్ట్ చేసిన రేంజ్‌లో మంత్రులు దూసుకుపోవడం లేదని..ప్రచారంలో మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు కూడా కాంగ్రెస్ అభ్య‌ర్థి గెలుపున‌కు అవ‌రోధంగా మారాయని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారట.


బీఆర్ఎస్ అభ్యర్ధి మాగంటి సునీత తన భర్త మాగంటి గోపీనాథ్‌ను తలుచుకుని కన్నీళ్లు పెట్టుకోవడంపై మంత్రులు తుమ్మల, పొన్నం చేసిన వ్యాఖ్యలు జ‌నంలోకి రాంగ్ సిగ్న‌ల్స్ పంపుతున్నాయ‌ని .. అవి అంతిమంగా పార్టీకే మైన‌స్ అయ్యేలా ఉన్నాయ‌ని రేవంత్ కు నివేదిక‌లు వెళ్లిపోయాయంటున్నారు. మంత్రుల కామెంట్స్ మహిళా ఓటర్లను ప్రభావితం చేసేలా ఉన్నాయని .. అంతిమంగా అది సెంటిమెంటుగా మారితే ఆ వ్యాఖ్య‌లు బీఆర్ఎస్ అభ్యర్ధి మాగంటి సునీత‌కే మేలు చేసేలా ఉన్నాయని రేవంత్‌రెడ్డి వ‌ద్ద నివేదిక‌లు ఉన్న‌ట్టు స‌మాచారం. ఇదిలా ఉంటే జూబ్లీహిల్స్‌లో పెద్దఎత్తున నకిలీ ఓట్లను సృష్టించారని బీఆర్ఎస్ ఆరోపిస్తూ ఈసీకి ఫిర్యాదు చేసింది. దీనిపై కూడా మంత్రులు గ‌ట్టిగా కౌంట‌ర్లు ఇవ్వ‌లేక‌పోయార‌ని.. కాంగ్రెస్ వైపు నుంచి స‌రైన స‌మాధానం ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌లేక పోయింద‌న్న అసంతృప్తి రేవంత్ లో బ‌లంగా ఉందంటున్నారు. ఈ నేప‌థ్యంలో నే ఉప ఎన్నిక ఇంచార్జీలుగా ఉన్న మంత్రులను నమ్ముకుంటే ప‌ని అయ్యేలా లేదని.. ఎన్నికలు అయిపోయే వరకు పూర్తిస్థాయిలో జూబ్లీహిల్స్‌పై తానే రంగంలోకి దిగ‌డంతో పాటు అంతా మానిట‌రింగ్ చేయాల‌ని భావిస్తున్నార‌ట‌.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: