కరోనా కష్టకాలంలో రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వైరస్ విజృంభణ వల్ల అన్ని రంగాలతో పాటు వ్యవసాయ రంగం నష్టాలపాలైంది. ఒకవైపు కరోనా మహమ్మారి వ్యాప్తి రైతులు కష్టాలు పడుతున్న సమయంలో అధిక వర్షాల వల్ల పంటలు నాశనం అయ్యాయి. ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆదుకోవాలనే ఉద్దేశంతో కీలక నిర్ణయం తీసుకుంది. ఖరీఫ్ సీజన్ లో రైతులకు ప్రయోజనం చేకూరేలా మద్దతు ధరలను పెంచింది.
 
కేంద్రం వరి పంటకు మద్దతు ధర 53 రూపాయలకు పెంచగా నూతన మద్దతు ధర 1868గా ఉంది. వరి (గ్రేడ్ ఎ రకం) నూతన ధర 53 రూపాయలు పెరిగి 1888గా ఉంది. జొన్నలు ( హైబ్రీడ్) నూతన ధర 70 రూపాయలు పెరిగి 2,620 రూపాయలు పెరిగింది. జొన్నలు ( దేశీయ) నూతన ధర 2640 రూపాయలకు పెరిగింది. 150 రూపాయల పెరుగుదలతో సజ్జల మద్దతు ధర 2,150 రూపాయలకు చేరింది. కొత్త మొక్కజొన్నల నూత ధర 90 రూపాయలు పెరిగి 1,850 రూపాయలకు చేరింది.
 
145 రూపాయల పెంపుతో రాగుల నూతన ధర 3,295 రూపాయలకు పెరగగా కందుల నూతన ధర 200 రూపాయలు పెరిగి 6,000 రూపాయలకు చేరింది. 146 రూపాయల పెంపుతో పెసల ధర 7,196 రూపాయలకు చేరగా 300 రూపాయల పెంపుతో మినుముల ధర 6,000 రూపాయలకు చేరింది. వేరుశనగ నూతన ధర 185 రూపాయలు పెరిగి 5,275 రూపాయలకు చేరగా ప్రొద్దుతిరుగుడు నూతన ధర 235 రూపాయలు పెరిగి 5,885కు చేరింది.
 
175 రూపాయల పెంపుతో సోయాబీన్ ధర 3,880 రూపాయలకు పెరగగా 370 రూపాయల పెంపుతో నువ్వుల నూతన ధర 6,855కు చేరింది. ఒడిసెలు నూతన ధర 755 రూపాయల పెంపుతో 6,695కు చేరగా ప్రత్తి(మధ్యరకం) నూతన ధర 260 రూపాయలు పెరిగి 5,515 రూపాయలకు పెరిగింది. ప్రత్తి( పొడవు రకం) నూతన ధర 275 రూపాయలు పెరిగి 5,825 రూపాయలకు చేరింది.

మరింత సమాచారం తెలుసుకోండి: