అధికార టీఆర్ఎస్ పార్టీకి రాష్ర్టంలో తల నొప్పిగా తయారైన బీజేపీ ఎంపీల గురించి అడిగితే ప్రతి ఒక్కరూ ఠక్కున చెప్పే సమాధానం బండి సంజయ్ , ధర్మపురి అర్వింద్ అని. ఇద్దరు ఎంపీలు కూడా అధికార టీఆర్ఎస్ పార్టీ కి చెందిన బడా నాయకులను ఎన్నికలలో ఓడించి విజయ కేతనం ఎగురేశారు. మరో విశేషమేంటంటే ఇద్దరి చేతిలో ఓడిపోయిన వారు కూడా సీఎం కేసీఆర్ కు ఆప్తులు కావడం గమనార్హం. అందులో ఒకరు స్వయానా సీఎం కూతురు కల్వకుంట్ల కవిత అయితే మరొకరు సీఎం దగ్గరి బందువు వినోద్ కుమార్ ఇలా ఇద్దరిని ఓడించిన ఈ బీజేపీ నేతలు ఢిల్లీకి వెళ్లి పార్లమెంట్ గడప తొక్కారు. అప్పటి నుంచి ఎలాగైనా సరే వారిని ఇరకాటంలో పడేయాలని చూస్తున్న టీఆర్ఎస్ కు అది మాత్రం వీలు కావడం లేదు. ఏకంగా బండి సంజయ్ అందనంత ఎత్తుకు చేరి పోయాడు. అతడు తెలంగాణ రాష్ర్ట బీజేపీకి అధ్యక్షుడయ్యాడు. ఇక అధ్యక్షుడయిన తర్వాత టీఆర్ఎస్ ను మరింత ఇరకాటంలో పెట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు.




ఇక వీరు హుజూరాబాద్ ఉప ఎన్నిక మీద స్పందించారు. రాష్ర్టం మొత్తం హుజూరాబాద్ వైపు చూస్తున్న ఈ తరుణంలో వారు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇటీవలే టీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీ గూటికి చేరారు. దీంతో కమలనాథులు రెట్టించిన ఉత్సాహంతో ఉప ఎన్నికల బరిలో దిగుతున్నారు. కానీ ఎలాగైనా గెలవాలని చూస్తున్న టీఆర్ఎస్ నియోజకవర్గంలో ఉన్న దళితులు ఓట్లను రాబట్టుకునేందుకు దళిత బంధు పథకాన్ని తీసుకు వచ్చింది. ఇక ఈ పథకంపై వీరు విమర్శలు గుప్పించారు. ప్రజా స్పందన చూసి భయపడే సీఎం కేసీఆర్ దళిత బంధును ప్రవేశపెట్టాడని వారు ఆరోపించారు. ఇక రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీకి సీఎం కేసీఆర్ ఓనర్ అయ్యాడని మరో ఎంపీ ధర్మపురి అర్వింద్ వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: