విశాఖపట్నంలో టీడీపీకి అనుకూలంగా రాజకీయ పరిస్తితులు మారుతున్నట్లు కనిపిస్తున్నాయి...ఇప్పటివరకు విశాఖలో వైసీపీదే హవా అన్నట్లు పరిస్తితి ఉంది. గత ఎన్నికల్లో కూడా విశాఖలో వైసీపీ హవా స్పష్టంగా నడిచింది. కానీ విశాఖ సిటీలో మాత్రం టీడీపీ సత్తా చాటింది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక పరిస్తితులు మారాయి..సిటీలో కూడా వైసీపీ హవా మొదలైంది. పైగా కార్పొరేషన్ స్థానాన్ని కైవసం చేసుకోవడంతో సీన్ మారిపోయింది. టోటల్‌గా వైసీపీ హవానే ఉన్నట్లు ఉంది.

కానీ నిదానంగా విశాఖ రాజకీయ మారుతున్నట్లు తెలుస్తోంది. వైసీపీకి ధీటుగా టీడీపీ కూడా మెరుగైన స్థితికి వచ్చినట్లు ఉంది. ముఖ్యంగా విశాఖ పార్లమెంట్ పరిధిలో టీడీపీ వేగంగా పుంజుకుందని చెప్పొచ్చు. ప్రస్తుతం వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి, ఆ పార్టీదే హవా అన్నట్లు కనిపిస్తోంది...కాకపోతే క్షేత్ర స్థాయిలో మాత్రం రాజకీయం మారుతుంది.

విశాఖ పార్లమెంట్‌లో టీడీపీ లీడ్‌లోకి వచ్చినట్లు కనిపిస్తోంది. సిటీలో కాస్త టీడీపీకే ఆధిక్యం ఉందని చెప్పొచ్చు. అయితే కాస్త వైసీపీకి కూడా పట్టు చిక్కింది. అయితే గాజువాక, భీమిలి, శృంగవరపుకోట నియోజకవర్గాల్లో టీడీపీకి బాగా ప్లస్ అవుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా భీమిలి, ఎస్.కోటల్లో టీడీపీకి ఎడ్జ్ కనిపిస్తోంది. అయితే గాజువాకలో పవన్ కల్యాణ్ పోటీ చేస్తే ...జనసేన హవా ఉంటుంది. లేదంటే టీడీపీకి ఎడ్జ్ ఉంటుంది. అటు సిటీలో చూసుకుంటే సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ ఎలాగో వైసీపీ వైపుకు వెళ్ళిపోయారు. కానీ అక్కడ టీడీపీ ఇంచార్జ్‌గా గండి బాబ్జీని పెట్టారు. ఇప్పుడుప్పుడే అక్కడ టీడీపీకి ప్లస్ కనిపిస్తోంది. ఈస్ట్, వెస్ట్‌ల్లో టీడీపీ బలంగానే ఉంది. నార్త్‌లోనే కాస్త డౌట్ ఉంది. అక్కడ గంటా శ్రీనివాసరావు పెద్దగా యాక్టివ్‌గా లేరు.

దీంతో అక్కడ టీడీపీ వీక్ అయింది. ఇక ఇక్కడ ఒక విషయం చెప్పాలి....నెక్స్ట్ ఎన్నికల్లో గానీ టీడీపీతో జనసేన కలిస్తే మాత్రం విశాఖలో వైసీపీ పరిస్తితి కష్టమే. అన్నీ సీట్లలో టీడీపీ-జనసేనల హవానే ఎక్కువ ఉండేలా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: