ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది కరోనా వైరస్. ఫస్ట్ వేవ్ తట్టుకున్న ప్రపంచం... గతేడాది సెకండ్ వేవ్ కూడా ఓ కుదుపు కుదిపేసింది. ఆక్సిజన్ కొరత కారణంగా వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమం ఈ ఏడాది జనవరి 16వ తేదీ నుంచి జోరుగా కొనసాగుతోంది. ఇక వచ్చే ఏడాది జనవరి 3వ తేదీ నుంచి 15 సంవత్సరాలు దాటిన వారికి కూడా వ్యాక్సిన్ డోసు ఇవ్వాలని రెండు రోజుల క్రితమే ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఎక్కడో ఆఫ్రికా దేశాల్లో పుట్టిన ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. ఇప్పటికే యావత్ ప్రపంచాన్ని ఒమిక్రాన్ ఆవహించేసింది. దేశంలో ఒమిక్రాన్ విస్తరించకుండా ఇప్పటికే కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా 144 సెక్షన్ విధించింది. అలాగే న్యూ ఇయర్ వేడుకలపై కూడా అన్ని రాష్ట్రాలు ఆంక్షలు పెట్టాలని కూడా ఆదేశించింది. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్  రాష్ట్రాలు ఇప్పటికే నైట్ కర్ఫ్యూ విధించాయి. దేశంలో ఒమిక్రాన్ కేసుల నమోదులో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉండగా... తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది.

ప్రస్తుతం ప్రతి రోజు తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ కొత్త కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. ఇదే ఇప్పుడు ప్రభుత్వాన్ని, ప్రజలను కూడా తీవ్రంగా కలవరపెడుతోంది. డెల్టా వేరియంట్ కంటే కూడా మూడు రెట్లు అధికంగా ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతుందని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో కేసుల సంఖ్య క్రమంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే దాదాపు అన్ని జిల్లాల్లో ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా సరే... ఏ మాత్రం ఫలితం రావటం లేదు. తాజాగా వరంగల్ జిల్లాలో కొత్త ఒమిక్రాన్ వేరియంట్ కేసు వెలుగు చూసింది. స్విట్జర్లాండ్ నుంచి వచ్చిన 24 ఏళ్ల యువకుడికి ఒమిక్రాన్ పాజిటివ్ నిర్థారణ అయ్యింది. ఈ విషయాన్ని జిల్లా వైద్యాధికారులు ధృవీకరించారు. డిసెంబర్ 12వ తేదీన విదేశాల నుంచి వచ్చినట్లు గుర్తించిన అధికారులు... అతనికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇన్ని రోజులుగా ఆ యువకుడి కాంటాక్ట్స్ గురించి కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. యువకుడిని హైదరాబాద్ తరలించి చికిత్స అందిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: