ఇటీవలే ఏపీ రాజకీయాల్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లా మందస మండలం పొత్తంగి కి చెందిన టీడీపీ కార్యకర్త కోన వెంకటరావు పురుగుల మందు  తాగి ఆత్మహత్య చేసుకోవడం సంచలనం గా మారిపోయింది. అధికార వైసీపీ పార్టీ నాయకులకు వ్యతిరేకంగా ఏడాదిన్నర కిందట పెట్టిన సోషల్ మీడియా పోస్టింగ్ పై పోలీసులు తీవ్ర స్థాయిలో వేధింపులకు గురిచేస్తున్నారనే కారణంతోనే మనస్థాపం చెంది ఇక కోన వెంకట్ రావు ఆత్మహత్య చేసుకున్నారు అంటూ టిడిపి నేతలు అందరూ కూడా ఆరోపిస్తూ ఉండటం గమనార్హం.


 ఈ క్రమంలోనే టిడిపి నేతలు అందరూ కూడా ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఆందోళన చేపట్టారు. కాగా సరిగ్గా ఏడాదిన్నర క్రితం ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్ కు వ్యతిరేకంగా కోన వెంకట్ రావు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. ఇక ఈ పోస్ట్ పై ఇటీవల టెక్కలి పోలీస్ స్టేషన్ లో వైసీపీ కార్యకర్తలు ఫిర్యాదు చేయడం గమనార్హం. ఈ క్రమంలోనే ఇటీవలే పోలీసులు కోన వెంకట్ రావు ఇంటికి వెళ్లగా.. ఆయన లేకపోవడంతో మందస పోలీస్ స్టేషన్ కు రావాలని ఆయన భార్య కృష్ణవేణి చెప్పారు. ఒకవేళ కోన వెంకట్ రావు రాకపోతే కుటుంబ సభ్యులందరినీ పోలీస్ స్టేషన్కు తీసుకు వెళ్లాల్సిన వస్తుంది అంటూ హెచ్చరించారు.


 ఇక ఇదే విషయాన్ని కోన వెంకట్ రావు కు భార్య సెల్ఫోన్ ద్వారా చెప్పగా. ఇచ్చాపురం లో ఉన్న తన సోదరి ఇంటికి రావాలి అంటూ వెంకట్రావు సూచించాడు. ఈ క్రమంలోనే భార్య ఆటోలో బయలుదేరగా పురుగుల మందు తాగానని పొలం లో ఉన్నాను భార్యకు ఫోన్ చేసి చెప్పాడు. ఒక గ్రామంలో ఈ విషయాన్ని చెప్పి తిరుగు ప్రయాణమైంది భార్య. కొన ఊపిరితో  ఉన్న కోన వెంకట్ రావును పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. మార్గమధ్యంలోనే   మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసుల వేధింపులు కారణంగానే కోన వెంకట్ రావు మృతి చెందాడని బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు మృతదేహాన్ని తరలించే లేదంటూ ఆస్పత్రి వద్ద టిడిపి కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.  కాగా మృతికి సంతాపం తెలియజేసిన చంద్రబాబు నాయుడు రెండు లక్షల పరిహారం ప్రకటించారు. కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: