వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాలేరు నియోజకవర్గం నుండి పోటీచేయబోతున్నారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. పాలేరు నియోజకవర్గం ఖమ్మం జిల్లాలోనిదే. ఈ నియోజకవర్గం నుండే షర్మిల పోటీచేయాలని ఎందుకు అనుకున్నారు ? ఎందుకంటే ఇందుకు మూడు కారణాలున్నాయి. మొదటిది ఖమ్మం జిల్లాలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ అభిమానులు, మద్దతుదారులు విపరీతంగా ఉన్నారు.





రెండో కారణం ఏమిటంటే పాలేరులో ఎస్టీ సామాజికవర్గం ఓట్లు ఎక్కువ. మూడో కారణం ఏమిటంటే ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్-టీడీపీ-టీఆర్ఎస్-వామపక్షాలకు దాదాపు సమానమైన పట్టుంది. ఇన్నిపార్టీల అభ్యర్ధుల పోటీమధ్య తానుపోటీచేస్తే గెలుపు సులభం అవుతుందని షర్మిల నమ్ముతున్నట్లున్నారు. ఇక ముందు చెప్పుకున్న కారణాలు ఎటూ ఉండనే ఉన్నాయి.





ఇక్కడ గమనించాల్సిందేమంటే 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున ముగ్గురు ఎంఎల్ఏలు, ఒక ఎంపీ గెలిచారు. ఒక ఎంపీ+3 అసెంబ్లీ స్ధానాల్లో వైసీపీ గెలుస్తుందని ఎవరూ ఊహించలేదు. ఎందుకంటే అప్పటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి తన దృష్టిమొత్తాన్ని ఏపీమీదే ఉంచి తెలంగాణాను పూర్తిగా వదిలేశారు. తెలంగాణాలో జగన్ ప్రచారం చేయకపోయినా కేవలం వైఎస్సార్ బొమ్మ పెట్టుకుని నామినేషన్ వేసి ప్రచారం చేసుకుంటేనే ఒక ఎంపీ, మూడు అసెంబ్లీల్లో గెలిచారు.






ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాల్లో ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి,  పినపాక, వైరా, అశ్వారావుపేట ఎంఎల్ఏలు పాయం వెంకటేశ్వర్లు, మదన్ లాల్, తాటి వెంకటేశ్వర్లు టీఆర్ఎస్ లో చేరిపోయారు. ఎంఎల్ఏలుగా గెలిచిన ముగ్గురూ ఎస్టీలే.






ఇపుడు పాలేరు జనరల్ సీటే అయినా ఎస్టీ ఓటర్లే ఎక్కువ. పైగా మొదటినుండి రెడ్లదే ఆధిపత్యం. ఉన్న ఓట్లు కాంగ్రెస్-టీఆర్ఎస్-బీజేపీ-వామపక్షాల మధ్య చీలిపోతే తాను ఈజీగా గెలవచ్చని షర్మిల లెక్కేసుకున్నారు. అందుకనే ఇక్కడినుండి పోటీకి రెడీ అయిపోయారు. అందుకనే పార్టీ యంత్రాంగం మొత్తం పాలేరులో దృష్టికేంద్రీకరించారు. షర్మిల పాదయాత్రకు ఖమ్మం జిల్లాలో జనాలు బాగా వస్తున్నారు. దాంతో వైఎస్ ను ఆయన మద్దతుదారులు, అభిమానులు ఇంకా మరచిపోలేదని నిరూపణైంది. ఈ ధైర్యంతోనే షర్మిల పాలేరును ఎంచుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: