సాధారణం గా నగరాలలో ఎంత ట్రాఫిక్ ఉంటుందో ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ ట్రాఫిక్ నుంచి ఉపశమనం కల్పించేందుకు ప్రతి ఒక్కరికి కూడా మెట్రో రైల్ అందు బాటులోకి తీసుకు వస్తున్నాయి ప్రభుత్వాలు. ఇప్పటికే దేశం లోని కీలకమైన నగరాలు అన్నింటిలో కూడా మెట్రో రైల్ సేవలు కొనసాగుతున్న అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే నగరవాసులందరూ కూడా ట్రాఫిక్ రహిత ప్రయాణాన్ని ఎంతగానో వినియోగించుకుంటున్నారు. మెట్రో రైల్ ప్రయాణం లో ఎప్పటికప్పుడు సరికొత్త మార్పులు తీసుకువచ్చేందుకు అటు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి అని చెప్పాలి.


 ఈ క్రమం లోనే కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియా కార్యక్రమానికి అనుగుణంగా నగరవాసులు అందరికీ కూడా కాగిత రహిత ప్రయాణాన్ని అందించేందుకు ఇటీవల హైదరాబాద్ మెట్రో,  ఎల్ అండ్ టి సంస్థలు తొలిసారిగా ఈ టికెటింగ్ విధానాన్ని ప్రారంభించాడు. గత కొన్ని నెలల నుంచి కూడా ఇదే విషయంపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తున్న అధికారులు ఇక మెట్రో స్టేషన్ లో వాట్సాప్ టికెటింగ్ అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రయాణికులు ప్రవేశద్వారం వద్ద క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఎక్కడికి వెళ్లాలో ఎంటర్ చేసి యూపీఐ ద్వారా డబ్బులు చెల్లించేందుకు అవకాశం ఉంటుంది.


 ఆ తర్వాత వాట్సాప్ లో వచ్చిన టికెట్ను స్కాన్ చేస్తే చాలు ఇక మెట్రో రైలు గేటు తెరుచుకుంటుంది. ఒక ఈ విషయంపై ఎల్ అండ్ టి ఎమ్డి సి ఓ కేవిబి రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదటిసారి వాట్సప్ టికెటింగ్ విధానాన్ని హైదరాబాద్ మెట్రోలో ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు.. ఇక రానున్న రోజుల్లో మరిన్ని డిజిటల్ లావాదేవీలు జరిగే విధంగా సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువస్తాము అని తెలిపారు. ఇక మెట్రో ప్రయాణికులు అందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలంటే సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: