
అయితే ఎన్ని పథకాలు ఉన్నప్పటికీ జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన సచివాలయ వ్యవస్థ గురించి మాత్రం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. గతంలో గ్రామీణ ప్రాంతాలలో తీసుకుంటే ఒక చిన్న కాస్ట్ సర్టిఫికెట్ కావాలన్నా మండల ఆఫీస్ కు వెళ్లి అప్లై చేసి వారం పది రోజులు అయితే అప్పుడు అయినా వస్తుందా లేదా అన్నది చెప్పలేము. పైగా అక్కడ పనిచేసే అధికారులకు చిన్నమొత్తంలో లంచాలు ఇస్తే కానీ పనులు జరగని పరిస్థితి. ఈ విషయంలో గ్రామీణ ప్రాంత ప్రజలు ఎన్ని సమస్యలను ఎదుర్కొన్నారో వారికే తెలుస్తుంది. అయితే ఈ విషయాన్ని జగన్ పాదయాత్ర సమయంలో గమనించి తీసుకున్న ఒక మంచి నిర్ణయమే సచివాలయ వ్యవస్థను నెలకొల్పడం.
ఇప్పుడు ఏ సర్టిఫికెట్ కావాలన్నా ఎటువంటి లంచం లేకుండా కేవలం రెండు మూడు రోజుల్లోనే వాలంటీర్ స్వయంగా ఇంటికి వచ్చి మరీ ఇచ్చే పరిస్థితిని సీఎం జగన్ కల్పించారు. ఈ ఒక్క విషయంలో ఆంధ్రప్రదేశ్ లోని గ్రామీణ ప్రాంతంలో నివసించే ప్రతి ఒక్కరూ గుండె మీద చేయి వేసుకుని జగన్ కు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు. ఇక ఇది మాత్రమే కాకుండాఆ అమ్మఒడి , ఆసరా, విద్యాదీవెన లాంటి మిగిలిన చాలా పథకాలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అందుకే ఈసారి కూడా జగన్ ను గెలిపించేది ఈ పథకాలే అంటూ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.