యువగళం పేరుతో తెలుగుదేశంపార్టీ ఆశాకిరణం నారా లోకేష్ మొదలుపెట్టిన పాదయాత్రలో సీనియర్లు పెద్దగా కనబడటంలేదు. పాదయాత్రలో హడావుడంతా వారసులదే కనబడుతోంది. చింతకాయల అయ్యన్నపాత్రుడు, యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, కళా వెంకటరావు, పరిటాల సునీత లాంటి సీనియర్లు పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే పాదయాత్ర ప్రారంభంరోజు నుండి మూడోరోజు ముగిసేనాటికి కూడా చాలామంది సీనియర్ల జాడ కనబడలేదు. ఆద్యంతం జూనియర్లే లోకేష్ చుట్టుపక్కల కనబడుతున్నారు.




కింజరాపు రామ్మోహన్ నాయుడు, చింతకాయల విజయ్, పరిటాల శ్రీరామ్, gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>బొజ్జల సుధీర్ రెడ్డితో పాటు యువనేతలు ఎక్కువగా ఫోకస్ అవుతున్నారు. దీనివెనుక పార్టీ అనుసరిస్తున్న వ్యూహం ఉన్నట్లు సమాచారం. అదేమిటంటే వచ్చేఎన్నికల్లో 40 శాతం టికెట్లను యువతకే కేటాయిస్తానని చంద్రబాబునాయుడు ఇప్పటికే చాలాసార్లు ప్రకటించారు. దానికి అనుగుణంగానే పార్టీలో యువనేతలు ఎక్కువమంది ఉన్నట్లు జనాలందరికీ తెలియజేయటమే టార్గెట్ గా పెట్టుకున్నారట.




అందుకనే పాదయాత్రలో సీనియర్లను సైడ్ చేసేశారని టాక్ వినిపిస్తోంది. బహుశా రాబోయే ఎన్నికల్లో టికెట్లు కూడా సీనియర్లను పక్కనపెట్టేసి వాళ్ళ వారసులకు ఇవ్వటానికి చంద్రబాబు డిసైడ్ అయినట్లు సమాచారం. అందుకనే సీనియర్లలో అత్యధికులు ముఖ్యంగా మీడియా సమావేశాలకు, పార్టీ సమావేశాలకు మాత్రమే పరిమితమవుతున్నారట. యువతంటే సీనియర్ల వారసులు మాత్రమే కాదని పార్టీలో ఫ్రెష్ ఫేసెస్ చాలా అవసరమని వ్యూహకర్త రాబిన్ శర్మ బృందం ఇచ్చిన సలహాను పాటించాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారట.




ఇందులో భాగంగానే నియోజకవర్గాల వారీగా ఒకటికి రెండుసార్లు సర్వేలు నిర్వహిస్తున్నారు. వారసులనే ట్యాగ్ కాకుండా ఇతరత్రా కొత్త యువనేతలు ఎన్ని నియోజకవర్గాల్లో ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏమిటి ? ఆర్ధిక పరిస్ధితి తదితర విషయాల్లో సర్వేలు చేయించుకుంటున్నారట. ఇలాంటి అనేక కారణాల వల్లే పాదయాత్రలో  ఇపుడు లోకేష్ చూట్టూ  యుతనేతల సందడి ఎక్కువగా కనబడుతోంది. యువనేతలను ప్రోత్సహించటంలో చంద్రబాబు, లోకేష్ ఇద్దరిదీ ఒకే ఆలోచనగా ఉందట. అందుకనే పాదయాత్రలో సీనియర్ల పాత్ర తక్కువగా కనబడుతోందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: