ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి సీట్లు తగ్గుటాయని కొన్ని మీడియా చానెళ్లు మరియు అస్సలు గెలిచేది కూడా కష్టం అని మరికొన్ని మీడియా చానెళ్లు చెబుతున్నాయి. కొన్ని ప్రైవేట్ సర్వే సంస్థలు కూడా వైసీపీ మ్యాజిక్ ఫిగర్ కి మరో సీట్ల దూరంలో ఆగిపోతుంది అంటున్నారు. ఇలా వచ్చే ఎన్నికల గురించి రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. అయితే ఈ సర్వేలు , మీడియా ఛానెళ్ల ప్రచారానికి వైసీపీ అధినేత మరియు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఏమాత్రం దాని గురించి ఆలోచించకుండా ఖచ్చితంగా గతంలో కన్నా ఎక్కువ సీట్ లనే గెలుస్తామన్న ధీమాతోనే ఉన్నారు. కానీ వైసీపీ ప్రజాప్రతినిధులు అయిన ఎమ్మెల్యే మరియు ఎంపీ లు కొందరిలో ఓటమి ఆలోచనలు వెంటాడుతున్నాయట.

ముఖ్యంగా గత కొంతకాలంగా అధికార పార్టీ ఫై వస్తున్న విమర్శల వలన ప్రజలలో ఏర్పడిన వ్యతిరేకత గురించి వీరు తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు. అందుకే ఎవరికి వారు తమ సొంత వ్యూహాలలో తలమునకలై ఉన్నారు. అయితే ఈ పాయింట్ ను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడానికి టీడీపీ అధిష్టానం రెడీ అయినట్లు సమాచారం అందుతోంది. ఎవరైతే వైసీపీ ఎమ్మెల్యే మరియు ఎంపీలు వచ్చే ఎన్నికలలో ఓడిపోతాము అన్న భావనను కలిగి ఉన్నారో వారిని గుర్తించి తమ పార్టీలోకి తీసుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఎన్నికల వ్యూహకర్త రాబిన్ శర్మ నేతృత్వంలో ఒక టీం రంగంలోకి దిగనుందట. ఆ లెక్కన దాదాపుగా ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే 40 మంది ఎమ్మెల్యేలు మరియు ఎంపీలు పక్కదారి పట్టడానికి చూస్తున్నారట.

వీరిని కనుక టీడీపీ తమ పార్టీలోకి తీసుకుంటే వైసీపీని దెబ్బ తీసినట్లే అవుతుంది. అయితే వీరిని పార్టీలోకి తీసుకున్నాక వచ్చే ఎన్నికల్లో సీటు ఇచ్చినా ఇవ్వకున్నా ఏదో ఒక విధంగా తమ వైపుకు వారికి మద్దతును ఇచ్చే వారిని తిప్పుకున్నట్లే. ఇది కనుక సరిగా వర్క్ అవుట్ అయితే వైసీపీకి ఓటమి తప్పదు. మరి చంద్రబాబు వేస్తున్న ఈ మాస్టర్ ప్లాన్ ను జగన్ ఊహించి వారి ప్రయత్నాన్ని ఎండగడతాడా లేదా అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.  


మరింత సమాచారం తెలుసుకోండి: