నిర్వహణ భారమే అష్టకష్టాలు పడుతున్న ప్రింట్ మీడియాకు ఇప్పుడు నిజంగానే కష్టకాలం వచ్చి పడింది. సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా బాగా అభివృద్ధి చెందిన తర్వాత ప్రింట్ మీడియాకు ఆదరణ బాగా తగ్గిపోయింది. సిబ్బంది జీతభత్యాలు, పత్రిక ముద్రణ, రవాణా, పంపిణి ఇలా ప్రతి దశల్లోనూ ఎన్నో ఇబ్బందులను దినపత్రికలు ఎదుర్కొంటున్నాయి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కరోనా భయం ఎక్కువ అవ్వడం, ఆ వైరస్ దినపత్రికల పై ఎక్కువ కాలం నిలిచి ఉంటుంది అనే ప్రచారం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అవుతుండడంతో పేపర్లు కొనేందుకు జనాలు ఇష్టపడడం లేదు. ఈ ప్రభావం చాలా తీవ్రంగా ఉండడంతో ఈ కరోనా వ్యవహారం తేలే వరకు దిన పత్రికల ముద్రణ నిలిపివేయమని చెప్పే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది.

 

IHG


 పత్రికల ముద్రణ ఈ కరోనా వ్యవహారం తేలేవరకు ముద్రణ ఆపేస్తేనే మంచిది అన్నట్లుగా పత్రికల యాజమాన్యాలు ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ కరోనా ప్రభావం ఎంత కాలం ఉంటుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఒకసారి పత్రికల ముద్రణను నిలిపి వేస్తే మళ్లీ వాటిని పునరుద్ధరించడం చాలా కష్ట సాధ్యం అయ్యే పని. పాఠకుల ఆదరణ ఆ తరువాత అంతంత మాత్రంగానే ఉండే అవకాశం కూడా లేకపోలేదు. అందుకే కరోనపై ఎదురుదాడి మొదలుపెట్టాయి పత్రికల యాజమాన్యాలు. అందుకే న్యూస్ పేపర్లపై కరోనా వైరస్ ఎక్కువ కాలం నిలిచి ఉంటుంది అనేది దృష్ప్రచారమేనని చెబుతూ ఎదురుదాడి మొదలుపెట్టాయి. డాక్టర్లు, నిపుణులతో కరోనా ప్రభావం అంతంతమాత్రమేనని చెప్పిస్తున్నాయి. ప్రత్యక కథనాలు తమ అనుబంధ న్యూస్ ఛానెల్స్ లో ప్రచారం చేయిస్తున్నాయి. 

 


ఈ విషయంలో ఏదో ఒక రకంగా జనాల్లో అపోహలు తొలగించాలి అన్నట్టుగా పత్రికల యాజమాన్యాలు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల పత్రికల పంపిణీ చేపట్టేందుకు ఎవరూ ముందుకురాని పరిస్థితి ఏర్పడింది. ఇది ఇలా ఉండగానే ప్రధానమంత్రి మోదీ పత్రికాధిపతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడి. కరోనాను ఎదుర్కోవడానికి తమదైన సలహాలిచ్చారు. మీడియా ద్వారానే కరోనాపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ నేపథ్యంలో పత్రికల ముద్రణ ఆపకుండా ఉండేందుకు పత్రికల యాజమాన్యాలు ప్రయత్నిస్తున్నా పాఠకుల ఆదరణ ఏ మాత్రం ఉంటుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: