ఇదిలావుంటే.. ఆశ్చర్యంగా.. జమిలి ఎన్నికలపై రెండు తెలుగు రాష్ట్రాలు వ్యూహాత్మకంగా పావులు కదిపా యని తెలుస్తోంది. జమిలి ఎన్నికలకు తాము సై! అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏపీ సీఎం జగన్ లు ఓకే చెప్పినట్టు ఢిల్లీ వర్గాలు పేర్కొంటున్నాయి. అదేసమయంలో ఏపీలోని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ.. కూడా ఓకే చెప్పినట్టు సమాచారం. ఇక, జనసేన ఎలానూ.. బీజేపీతోనే పొత్తు పెట్టుకుంది కనుక.. జమిలిపై ఎలాంటి సమస్య ఉండబోదు. ఇక, తెలంగాణ విషయానికి వస్తే.. కాంగ్రెస్, ఎంఐఎంలు మాత్రం ఈ విషయంలో ఆలోచన చేస్తున్నాయి.
బీజేపీప్రతిపాదన వెనుక.. వ్యూహం ఉందని భావిస్తున్న ఎంఐఎం నాయకులు.. జమిలికి దూరంగా ఉండాలని భావిస్తున్నారు. ఇక, ఏపీ, తెలంగాణ అధికార పార్టీలు సహా ప్రతిపక్షం టీడీపీ జమిలికి జై కొట్టడం వెనుక.. వ్యూహం ఉందని అంటున్నారు పరిశీలకులు. వైసీపీ సర్కారు... ప్రతిపక్షాల దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు ఎన్నికల నిర్వహణే బెటర్ అని భావిస్తుండగా ప్రతిపక్షం టీడీపీ.. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది కనుక తమకు ప్రయోజనం ఉంటుందని.. చంద్రబాబు భావిస్తున్నారు.
అదే సమయంలో కేంద్రంలోని బీజేపీ పెద్దలకు ఎదురు చెప్పకుండా ఉండాలనే వ్యూహం కూడా కనిపిస్తోంది. ఇక, తెలంగాణలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అధికార పార్టీ అధినేత కేసీఆర్.. జమిలికి జై కొడుతుండడం కూడా వ్యూహాత్మకమేన ని అంటున్నారు. ప్రస్తుతం ఫిఫ్టీ-ఫిఫ్టీగా ఉన్న వ్యతిరేకత.. మరిన్ని రోజులకు బలపడే అవకాశం ఉంటుంది కనుక.. దీనిని తగ్గించుకునేందుకు జమిలికి వెళ్లడమే బెటర్ అని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక, దీనిపై ఈ ఏడాది మధ్యలో లేదా.. చివరిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి