ఏపీలో పవన్ కల్యాణ్ రాజకీయం ఎలా మారుతుందో అర్ధం కాకుండా ఉంది..ఆయన ఎప్పుడు ఎలాంటి రాజకీయ నిర్ణయాలు తీసుకుంటారో క్లారిటీ రావడం లేదు. ప్రస్తుతం బీజేపీతో పయనిస్తున్న ఆయన, నెక్స్ట్ టీడీపీతో కలుస్తారా? లేక బీజేపీతో కలిసే ఎన్నికలకు వెళ్తారా? అనే విషయం ఇప్పటిలో తేలేలా లేదు. కానీ ఏది ఎలా జరిగినా ముందు మాత్రం క్షేత్ర స్థాయిలో జనసేన బలం పెంచాలని మాత్రం పవన్ ట్రై చేస్తున్నారు. అలా అని అన్నీ స్థానాల్లో జనసేన బలం పెరగడం కష్టం. అందుకే బలమైన స్థానాలని చూసుకుని...ఆ స్థానాల్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు.

గత ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో జనసేనకు మంచిగానే ఓట్లు పడిన విషయం తెలిసిందే...గెలవడానికి ఒక స్థానంలో గెలిచిన దాదాపు 20-30 స్థానాల్లో జనసేనకు కాస్త ఓట్లు ఎక్కువ పడ్డాయి. అలాంటి స్థానాలపైనే ఫోకస్ పెట్టి పవన్  పనిచేస్తున్నారు...ఇదే క్రమంలో తూర్పు గోదావరిలో వైసీపీకి కంచుకోటగా ఉన్న కొత్తపేటపై పవన్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇక్కడ పార్టీని బలోపేతం చేస్తే...గెలిచే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.


అయితే ఇక్కడ టీడీపీ గెలిచి 20 ఏళ్ళు అయిపోయింది. ఎప్పుడో 1999 ఎన్నికల్లో కొత్తపేటలో టీడీపీ గెలిచింది...మళ్ళీ ఇక్కడ టీడీపీ గెలవలేదు. 2004లో కాంగ్రెస్, 2009లో ప్రజారాజ్యం, 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. వైసీపీ నుంచి వరుసగా చిర్ల జగ్గిరెడ్డి గెలిచారు...అయితే జగ్గిరెడ్డి అనుకున్న మేర పనులు చేయడంలో విఫలమయ్యారని తెలుస్తోంది...ఆయనకు కొత్తపేటలో పెద్దగా పాజిటివ్ లేదు. అదే సమయంలో ఇక్కడ టీడీపీ పుంజుకోలేదు.

ఇదే జనసేనకు అడ్వాంటేజ్...జనసేన గాని ఇంకా ఫోకస్ పెట్టి పనిచేస్తే కొత్తపేటలో గెలిచేయొచ్చు. గతంలో ఇక్కడ ప్రజారాజ్యం కూడా గెలిచింది. కాబట్టి జనసేనకు గెలవడం సులువే. గత ఎన్నికల్లోనే 35 వేల ఓట్లు వరకు తెచ్చుకుంది. ఈ సారి ఇంకా కష్టపడితే గెలుపు దగ్గరకు వెళ్లొచ్చు. చూడాలి మరి కొత్తపేటలో ఈ సారి జనసేనకు కలిసొస్తుందో లేదో?

మరింత సమాచారం తెలుసుకోండి: