ఆంధ్రప్రదేశ్లో బిజెపి సీనియర్లు సైతం ఒక్కొక్కరుగా అలగడం మొదలు పెడుతున్నారు.. దీంతో హై కమాండ్ వరకు ఈ సందేశాన్ని ఏదో ఒక రూపంలో సంకేతాలను పంపిస్తూ ఉన్నారు. ఎన్నికలకు సిద్ధమవుతున్న సమయంలో విజయవాడలో ఏర్పాటు చేసినటువంటి పలు రకాల సమావేశాలకు సోము వీర్రాజు, జివిఎల్ నరసింహారావు, విష్ణువర్ధన్ రెడ్డి వంటి వారు మాత్రం అక్కడికి హాజరు కాలేదు.. అయితే వీరు పోటీ చేసేటువంటి అవకాశం కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నప్పటికీ సీట్ల సర్దుబాటు విషయంలో వీరి పేర్లను సైతం పరిగణంలోకి తీసుకోవడం లేదు.. వీరిని ఎంపీ అభ్యర్థులుగా ప్రకటించకపోవడంతో అసెంబ్లీ స్థానాలలో అయినా తమకు సీటు ఇవ్వాలంటే చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు.



ఈ సమయంలోనే అసంతృప్తిగా ఉన్నట్లు పలు రకాల సంకేతాలను కూడా బిజెపి అధికారానికి పంపిస్తూ ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే కీలకమైన సమావేశాలకు సైతం డుమ్మ కొట్టేస్తున్నారు ఈ ముగ్గురు నేతలు.. అయితే వీరు ఇలా చేసినప్పటికీ బిజెపి నేతలు వీటిని కవర్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. సోము వీర్రాజుకు ఆరోగ్యం బాగాలేదని.. ఈయన సీటు కోసం చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ముర్క్యంగా అనపర్తి సీటు కోసం సోమ వీర్రాజుకు ఆఫర్ చేసిన ఆయన మక్కువ చూపలేదట కేవలం రాజమండ్రి రూరల్ లో ఏదైనా ఒక సీటు ఇవ్వాలని అడుగుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అది కుదరకపోవడంతో ఈయన డుమ్మ కొడుతున్నట్లు చెబుతున్నారు.


సీట్ల కేటాయింపు విషయంలో బిజెపి సైతం ఎన్నో రకాలుగా ప్రణాళికలు వేస్తోంది. వైసీపీ వల్ల వచ్చిన ఈ నేతలకు టికెట్లు ఇస్తే టిడిపి ఓటర్లు ఓటు వేసే పరిస్థితి ఉండదనే అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తూ ఉండడంతో హై కమాండ్  కూడా వీరి సీట్లు ఇచ్చేందుకే సర్దుబాటు చేసేందుకు మాత్రం ఆసక్తి చూపడం లేదట.. కానీ వీరు మాత్రం పార్టీ ప్రయోజనాల సంగతి తర్వాత కానీ మాకు సీటు కావాలని పట్టుబడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: