టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నిన్నటి రోజున చిత్తూరు జిల్లాలోని ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరి నియోజవర్గం పుత్తూరులో నిర్వహించినటువంటి ప్రజాగళం సభలో మాట్లాడడం జరిగింది.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన చంద్రబాబు చాలా విమర్శలు కూడా చేశారు.. ముఖ్యంగా నగరి మీటింగ్ చూసిన తర్వాత ఏపీ సీఎం మైండ్ బ్లాక్ అవుతుందని కూడా చంద్రబాబు ఎద్దేవా చేశారు.. ఆంధ్రప్రదేశ్ ని డ్రగ్స్ భూకబ్జాలకు అడ్డగా మార్చాలంటూ కూడా విమర్శలు చేయడం జరిగింది. ఎన్నికల సమయంలో ప్రజలను మభ్యపెట్టి గెలిచి ఇప్పుడు ప్రజల పైన బాదుతున్నాడంటూ జగన్ ప్రభుత్వం పైన చంద్రబాబు విరుచుకుపడ్డారు.


మీ ఉత్సాహం చూస్తూ ఉంటే రాష్ట్రానికి మళ్లీ మంచి రోజులు వస్తున్నట్లు అనిపిస్తోందంటూ చంద్రబాబు తెలిపారు.. వచ్చే ఎన్నికలలో కూటమి గెలుపును ఎవరు కూడా ఆపలేరని చంద్రబాబు వెల్లడించారు.. రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని కేంద్రంలో బీజేపీ నే వస్తుందంటే తెలిపారు.. ఎవరు భయపడవద్దని గేమ్ ఎప్పుడో మొదలయ్యిందని వచ్చే ఎన్నికలు గెలుపు మనదే అంటూ చంద్రబాబు కాస్త ధీమాతో వ్యక్తం చేస్తున్నారు.. అలాగే నగరి ఎమ్మెల్యే మంత్రి రోజా పైన చంద్రబాబు సెటైర్లు సైతం వేయడం జరిగింది.


వైసీపీ ఎమ్మెల్యే రోజాను జబర్దస్త్ ఎమ్మెల్యే అంటూ నగరికి ఆమె ఏమి చేయలేదని ఆమె మోసాలకు పాల్పడుతోందంటూ తెలియజేశారు చంద్రబాబు.. రోజాకు డబ్బులు పంచుకోవడమే పని అంటూ కూడా ఆమెను విమర్శించారు. ముఖ్యంగా భువనేశ్వరి అనే మహిళకు మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తానంటూ ఆమె దగ్గర లంచం తీసుకుందని రోజుకు అయిన చంద్రబాబు ఆరోపణలు చేశారు.. అలాగే ఇసుక గ్రావెల్, భూ దందాలో రోజా అడ్డతీతంగా సంపాదించింది అంటూ చంద్రబాబు విమర్శించారు.. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైసిపి నాయకులు అంత చూస్తామంటూ చంద్రబాబు వెల్లడించారు.. అలాగే చేనేత కార్మికులకు 500 యూనిట్ వరకు కరెంట్ ఫ్రీగా ఇస్తామని కూడా వెల్లడించారు.. ఏపీ కోసమే అటు బిజెపి టిడిపి టిడిపి జనసేన పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు చంద్రబాబు.

మరింత సమాచారం తెలుసుకోండి: