ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలకపాత్రను పోషించే నగరాలలో విజయవాడ ప్రధానమైనది. ఇక వైసీపీ ప్రస్తుతం విజయవాడ నగరం పై చాలా ఇంట్రెస్ట్ ను చూపిస్తుంది. ఇక్కడ మొత్తం మూడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అందులో పోయినసారి రెండింటిని వైసీపీ దక్కించుకుంది. ఇక ఈసారి మొత్తం మూడింటిని కూడా దక్కించుకోవడానికి ప్రణాళికలను రచిస్తుంది.

అందులో భాగంగా ఈ మూడు స్థానాలలో కూడా మంచి క్యాండిట్ లను నిలబెట్టడంతో పాటు విజయవాడలో ఉన్న ఇతర నేతలను కూడా వైసీపీ తమ పార్టీలోకి తెచ్చుకుంటుంది.  బెజవాడలో మొత్తం తూర్పు , సెంట్రల్ , పశ్చిమ అని మూడు నియోజకవర్గలు ఉన్నాయి. ఇందులో పోయిన ఎన్నికలలో తూర్పు మినహా పశ్చిమ , సెంట్రల్ నియోజకవర్గలలో వైకాపా పార్టీ గెలుపొందింది.

ఇక ఈ సారి తూర్పు అసెంబ్లీ స్థానాన్ని కూడా గెలుపొందడానికి వైసిపి పార్టీ చూస్తోంది. ఇక స్థానికంగా ఉన్న దేవినేని అవినాష్ , వేల్లంపల్లి శ్రీనివాస్ , మల్లాది విష్ణు లకి బెజవాడ ఎంపీ కేసినేని నాని వైసీపీ పార్టీలోకి చేరడం మరింత కలిసివచ్చే అంశంగా మారింది. ఇక ప్రస్తుతం పశ్చిమ సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న వేల్లంపల్లి ని సెంట్రల్ అభ్యర్థిగా వైసిపి ప్రకటించింది. దానితో అక్కడి టిడిపి కార్యకర్తల్లో చాలా మందిని వేల్లంపల్లి వైసీపీ పార్టీలో చేర్చుకున్నారు.

ఇక తూర్పు నుండి అవినాష్ పోటీ చేయబోతున్నాడు. ఇక రెండు సార్లు వరుసగా తూర్పు నుండి గెలిచిన గద్దెను ఓడించడానికి ఈయన తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. ఇక అవినాష్ గెలుపు కోసం గతంలో ప్రజారాజ్యం పార్టీ నుండి గెలిచిన ఎలమంచిల రవి ని కూడా వైసిపిలో జాయిన్ చేసుకోవడానికి మంతనాలు జరుగుతున్నాయి. ఇక విజయవాడ పశ్చిమం విషయానికి వస్తే ఇక్కడ వైసిపి జోరు ఫుల్ గా ఉంటుంది. గడిచిన 2014 , 2019 ఎన్నికలలో ఇక్కడి నుండి వైసీపీ పార్టీ నేతలే గెలుస్తున్నారు.

ఇక ఈ సారి ఈ స్థానం నుండి షేక్ అసిఫ్ పోటీ చేయబోతున్నాడు. ఇక ఇక్కడ ఎక్కువ మంది మైనార్టీ సభ్యులు ఉండడంతో ఈయన గెలుపు ఈ సారి కాయంగా కనబడుతుంది. ఇలా విజయవాడలో ఉన్న మూడు అసెంబ్లీ స్థానాలను కూడా దక్కించుకోవడానికి వైసిపి పార్టీ శక్తికి మించి ప్రయత్నిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: