ఒకప్పుడు వరుస విజయాలతో ప్రజలలో మంచి గుర్తింపు తెచ్చుకొని ఇప్పుడు ఆ గెలుపు కోసమే పరితపిస్తున్న నాయకులు కూడా లేకపోలేదు.. అధికారం ఉన్నన్ని రోజులు ఆ అధికారాన్ని సక్రమంగా నిర్వహించలేక ప్రలోభాలకు లోనై నేడు ప్రజల విశ్వాసాన్ని కూడా కోల్పోయారు.. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా టిడిపి ఎమ్మెల్యే గెలుపే ముఖ్యంగా అడుగులు వేస్తున్నారు. అందుకే ఆయన చేసిన మోసాలను పసిగట్టిన ప్రజలు.. మళ్లీ ఆయనకు పట్టం కట్టడానికి వెనుకడుగు వేస్తున్నారు.. మరి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

తెలుగుదేశం పార్టీ హయాంలో ఏకంగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా అధికారాన్ని అధిష్టించి.. నమ్మి గెలిపించిన ప్రజలను వంచిస్తూ 30 ఏళ్ల పాటు అభివృద్ధికి దూరం చేసి.. అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు ఉరవకొండ టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ.. ఆయన మోసాలను గ్రహించిన ప్రజలు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధమవుతున్నారు.. అందుకే తనపై వస్తున్న వ్యతిరేకతను గమనించిన ఈయన ప్రలోభాలకు తెర లేపారు.. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఓటర్లకు వివిధ రూపాలలో గాలం వేస్తున్నారు.. గారడీ మాటలతో ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకుంటూ ఎమ్మెల్యేగా చలామణి అవుతున్న పయ్యావుల కేశవకు ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అందుకే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఉరవకొండలో ఎన్నికలకు 40 రోజుల ముందుగానే ప్రలోభాలకు తెరలేపారు.. ఓటర్లను మభ్య పెట్టేందుకు తన బ్యాచ్ ద్వారా శ్రీకారం చుట్టారు..

తాజాగా ఇండియా హెరాల్డ్ కు అందిన సమాచారం మేరకు.. ఓటర్లను ఎలాగైనా సరే తన వైపు తిప్పుకోవడానికి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో మహిళలకు చీరల పంపిణీకి శ్రీకారం చుట్టారు...అయితే చాలా గ్రామాల్లో మహిళలు చీరలు వెనక్కి ఇస్తుండడంతో టిడిపి నేతలు అయోమయ స్థితిలో పడ్డారు.. ఎమ్మెల్యే కేశవ్ సోదరుడు టిడిపి నేత పయ్యావుల శీనప్ప ఉరవకొండలో వివిధ కుల సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తూ.. ఆ మాటున వారికి డిన్నర్ల కోసం అంటూ రూ.50వేల వరకు అందిస్తున్నట్లు సమాచారం.. అంతేకాదు నియోజకవర్గంలోని ఇంటింటికి.. తమ బ్యాచ్ ను పంపి ప్రజల వివరాలను సేకరిస్తున్నారు .. స్థానికంగా ఉండే టిడిపి నాయకులతో పాటు అనంతపురం నుంచి వచ్చిన కొత్త వ్యక్తులు ఓటర్ జాబితాతో ఇంటింటికి వెళ్లి ఇంట్లో ఎంతమంది ఓటర్లు ఉన్నారు..  తదితర వివరాలు సేకరిస్తూ కుటుంబ యజమాని ఫోన్ పే,  గూగుల్ పే నెంబర్లు అడిగిమరీ తీసుకుంటున్నారు.. త్వరలో డబ్బు అందుతుందని కూడా వారిని మభ్యపెడుతున్నారు..


పదవీకాంక్షతో ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో నియోజకవర్గంలో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు చేర్చి.. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి.. ఇప్పుడు గెలుపు కోసం నానా తంటాలు పడుతున్నారు. ఇక ఇప్పుడు ఈయనకి పోటీగా ఉరవకొండ వైఎస్ఆర్సిపి అభ్యర్థి వై విశ్వేశ్వర్ రెడ్డి బోగస్ బరిలోకి దిగుతుండడంతో ఆయనకు గెలుపు భయం చుట్టుకుంది.. ఇక ఈయన చేసిన తప్పులే ఈయనకు అదృష్టం లేకుండా చేస్తున్నాయి.. మరి ఈసారి ఈయన చేసిన మోసాలను ప్రజలు గుర్తిస్తారా ? లేక మళ్ళీ ఆయనకే పట్టం కడతారా? అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: