సినీ నటుడు టిడిపి వ్యవస్థాపకుడు అయిన దివంగత మాజీ ముఖ్యమంత్రి సీనియర్ ఎన్టీఆర్ ఈ రోజున 101 వ జయంతి సందర్భంగా పలువురు అభిమానులు టిడిపి నేతలతో పాటు మనవళ్లు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వంటి వారు కూడా ఎన్టీఆర్ ఘాటు వద్దకు వెళ్లి నివాళులు అర్పించారు.. ఇప్పుడు తాజాగా సీనియర్ ఎన్టీఆర్ భార్య వైఎస్ఆర్సిపి నేత లక్ష్మీపార్వతి కూడా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించింది. ఇలాంటి సమయంలోనే మీడియా ముందు మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేసింది.


ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు కాబోయే సీఎం గురించి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో మరొకసారి జగనే సీఎం అవుతారని మంచి పరిపాలన నడుస్తుంది కాబట్టి అందుకే ఆశభావాన్ని తెలియజేస్తున్నానని తెలియజేసింది లక్ష్మీపార్వతి.. వైయస్ జగన్మోహన్ రెడ్డి వంటి వ్యక్తికి ఎన్టీఆర్ ఆశీస్సులు కచ్చితంగా ఉంటాయని జూన్ 4 తరువాత జగన్ సీఎం గా ప్రమాణస్వీకారం చేస్తారని ఏపీలో మళ్లీ మంచి పరిపాలన వస్తుందంటూ కూడా తెలియజేసింది లక్ష్మీపార్వతి. గత కొన్నేళ్లుగా లక్ష్మీపార్వతి చంద్రబాబు నాయుడుని ఏకిపారేస్తూ ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి.


చంద్రబాబు చాలా మోసగాడు అని ఎంతోమందిని మోసం చేశారని అలాగే సీనియర్ ఎన్టీఆర్ గారిని కూడా మోసం చేసే తన వద్ద నుంచి పార్టీని లాక్కున్నారని కూడా తెలియజేసింది. జూనియర్ ఎన్టీఆర్ లాంటి వారిని కూడా పార్టీలోకి వస్తే చాలా ఇబ్బందులను తెలిసి వారిని కూడా తొక్కేయాలని చూస్తున్నారని కూడా లక్ష్మీపార్వతి ఎన్నోసార్లు తెలియజేసింది. కేవలం తన లాభం కోసం తన కొడుకుని సీఎంగా చూడడం కోసం చంద్రబాబు ఎంతటి నిచానికైనా దిగజారుతారని కూడా ఎన్నో సందర్భాలలో తెలియజేసింది. అయితే ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ కి సీఎం జగన్మోహన్ రెడ్డి అవుతారని చెప్పి వైసిపి నేతలలో అభిమానుల కాస్త ఆనందాన్ని కూడా మరొకసారి నింపుతోంది లక్ష్మీపార్వతి.. దీంతో వైసిపి కార్యకర్తలు అభిమానులు సైతం ఈ విషయాన్ని వైరల్ గా చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: