- ( ఉత్త‌రాంధ్ర ప్ర‌తినిధి - ఇండియా హెరాల్డ్ )

పలాసలో కేంద్రీయ విద్యాలయ నిర్మాణ స్థలాన్ని సోమవారం కేంద్రీయ విద్యాలయ అసిస్టెంట్ కమిషనర్ మంజునాథ్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... సూది కొండకు ఆనుకొని ఉన్న ఈ స్థలం కేంద్రీయ విద్యాలయ నిర్మాణానికి అనువుగా ఉందని తెలిపారు. 2025 -26 సంవత్సరంలో తరగతులు ప్రారంభించేందుకు అనుగా ఉన్న రైల్వే పాఠశాల భవనాలను పరిశీలించారు. కేంద్ర క్యాబినెట్లో ఆమోదం పొందిన వెంటనే పలాసలో తరగతులు ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఆర్డివో, ఎమ్మార్వో, ఏపీ టిపిసి చైర్మన్ వజ్జ బాబురావు, జిల్లా పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి విఠల్ రావు, పలాస పట్టణ టిడిపి అధ్యక్షులు నాగరాజు, పలాస పట్టణ టిడిపి కార్యదర్శి నవీన్, అగ్నికుల క్షత్రియ డైరెక్టర్ లక్ష్మణరావు, బిసి సెల్ అధ్యక్షులు కామేష్, గాలి కృష్ణారావు, దువ్వాడ శ్రీకాంత్, జోగ మల్లి, రవిశంకర్ గుప్తా, మల్లిపెద్ది చిన్ని, అనిల్ శర్మ, తమ్మినేని గంగరావు,కొండె నర్సింహులు , దడియాల నరసింహులు, జనసేన జిల్లా కార్యదర్శి సంతోష్ పండా పలాస బిజెపి కన్వీనర్ రామానంద స్వామి తదితరులు పాల్గొన్నారు.


కేంద్రీయ విద్యాలయం కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ తెలియజేసింది హైదరాబాదు నుంచి నేరుగా కేంద్రీయ విద్యాలయ నిర్మాణ ప్రతిపాద ప్రాంతానికి చేరుకుని సూది కొండ వద్ద స్థ‌లాన్ని పరిశీలించారు అన్ని విధాలా అనువుగా ఉన్న ప్రదేశానిపై సంతృప్తి వ్యక్తం చేశారు రానున్న అకాడమిక్ సంవత్సరానికి గాను తాత్కాలికంగా తరగతులు ప్రారంభించుటకు కాను రైల్వే పాఠశాల భవనాలను పరిశీలించారు బృందంతో స్థానిక ఆర్టీవో పలాస తాసిల్దార్ స్థానిక నాయకులు ఉన్నారు కేంద్రీయ విద్యాలయం పై ఒడిగా పడుతున్న అడుగులతో నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్ర‌తిష్టాత్మ‌క విద్యాల‌యం ఏర్పాట‌య్యేందుకు ఢిల్లీ స్థాయిలో ఎంతో క‌ష్ట‌ప‌డిన కేంద్ర మంత్రి, రామ్మోహ‌న్ నాయుడుతో పాటు స్థానిక‌ ఎమ్మెల్యే గౌతు శిరీష‌పై నియోజ‌క‌వ‌ర్గ వ్యాప్తంగా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: