
ఆమధ్య జరిగిన ప్రచారం బట్టి చూస్తే మహానాడుని జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందులలో నిర్వహిస్తారని అందరూ అనుకున్నారు. వైసీపీకి పొలిటికల్ గా కూడా దెబ్బ కొట్టేలా టిడిపి ప్లాన్ చేసిందట. అయితే ఇప్పుడు చూస్తే మాత్రం మహానాడుని పులివెందులలో నిర్వహించలేదని.. కడపలో నిర్వహించేలా ప్లాట్ చేస్తున్నారు. ఇక కడుపలో కూడా సికేదిన్నే మండలం ,చెర్లోపల్లి గ్రామీణ ప్రాంతాలలో ఈ వేదికను జరిపించబోతున్నారట.
అందుకు సంబంధించి అక్కడ విశాలమైన భూములను కూడా పరిశీలించి మరి ఎంపిక చేసినట్లు వినిపిస్తున్నాయి. ఇక్కడే ఎందుకు నిర్వహిస్తున్నారు అంటే కడప, తిరుపతి, చిత్తూర్, అనంతపురం, హైదరాబాద్ వంటి మార్గాలు ఎక్కువగా కలుస్తాయని అందుకే మహానాడుని ఇక్కడ ఎంపిక చేసినట్లు టిడిపి నేతలు తెలియజేస్తున్నారు. ఈనెల 7వ తేదీన మహానాడుకు సంబంధించి పలు రకాల భూమి పూజ కార్యక్రమాలను కూడా నిర్వహించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మహానాడు ఈసారి టిడిపికి అత్యంత ప్రత్యేకంగా ఉండబోతుందట. భారీ మెజారిటీతో గెలిచిన కూటమి కోప అందుకునేందుకు నిర్వహిస్తున్నారు. మహానాడు సభకు 10 లక్షల మందికి పైగా అంచనా వేసినట్లు సమాచారం. కడప జిల్లా నుంచి టిడిపి సౌండ్ వినిపిస్తే ఇక అన్ని ప్రాంతాలలో కూడా రీసౌండ్ వస్తుందనేలా ఎంచుకున్నట్లు మాట్లాడుతున్నారు. మరి రాబోయే రోజుల్లో జగన్ అధికారంలోకి వస్తే ఎలాంటి సభను ఎక్కడ నిర్వహిస్తారు చూడాలి మరి.