
భారత్ కొట్టిన ఈ దెబ్బకు పాకిస్తాన్ ఎమర్జెనీ ప్రకిటించింది. మరోవైపు ` ఆపరేషన్ సింధూర్ ` పై చైనా రియాక్ట్ అయింది. పాకిస్తాన్‌కు సన్నిహిత మిత్రదేశమైన చైనా, భారత్‌తోనూ భూ సరిహద్దులను పంచుకుంటోంది. ఈ నేపథ్యంలోనే భారత్, పాక్ మధ్య ప్రస్తుతం నెలకొన్న పరిణామాలపై చైనా విచారం వ్యక్తం చేసింది. శాంతించాలంటూ ఇరు దేశాలకు స్పెషల్ రిక్వెస్ట్ చేసింది.
భారతదేశం, పాకిస్తాన్ రెండు దేశాలు సంయమనం పాటించాలని మరియు పరిస్థితిని మరింత దిగజార్చే చర్యలను నివారించాలని చైనా పిలుపునిచ్చింది. శాంతి మరియు స్థిరత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. ప్రస్తుత పరిస్థితి తీవ్రవరం కాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని, ప్రశాంతతను కాపాడుకోవాలని చైనా రెండు దేశాలను కోరింది. ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రిత్వ ఓ ప్రకటన విడుదల చేసింది.
గతంలో పహల్గామ్ ఉగ్రవాద దాడిని చైనా ఖండించింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి గువో జియాకున్ మాట్లాడుతూ.. మేము దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము. చైనా అన్ని రకాల ఉగ్రవాదాన్ని గట్టిగా వ్యతిరేకిస్తుందని పేర్కొన్నారు. కానీ పాకిస్తాన్ కే చైనా మద్దతు ప్రకటించింది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్‌తో మాట్లాడి దాడిపై వేగవంతమైన మరియు న్యాయమైన దర్యాప్తు కోసం పిలుపునిచ్చారు. పాకిస్తాన్‌తో చైనాకు ఉన్న సన్నిహిత సంబంధాలను వాంగ్ నొక్కి చెప్పారు. పాకిస్తాన్ తన సార్వభౌమత్వాన్ని మరియు భద్రతా ప్రయోజనాలను కాపాడుకోవడంలో చైనా మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు. ఈ సంగతి పక్కన పెడితే.. భారత్ ప్రతికారం చర్యపై దేశ వ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సెలబ్రిటీలు సైతం న్యాయం జరిగిందంటూ పోస్ట్‌లు పెడుతున్నారు.