
ఈ ప్రమాదంలో నలుగురు వృద్ధులు 5మంది 40 సంవత్సరాల లోపు వయసు ఉన్నవారు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఒకేసారి చాలామంది కుటుంబాలలో తీవ్రవిషధాన్ని నింపింది. ఈ ప్రమాదం నిన్నటి రోజున జరిగింది. ఇందులో ప్రాణాష్టం కూడా ఎక్కువగా జరగడంతో అక్కడ ఆందోళన పరిస్థితి ఏర్పడింది. మంటలు ఎక్కువగా వ్యాప్తి చెందడంతో భవనంలో చిక్కుకున్న వారిని వెంటనే బయటికి తీయలేకపోవడం వల్లే మృతుల సంఖ్య కూడా భారీగా పెరిగిందని అక్కడి స్థానికులు తెలియజేస్తున్నారు.
ప్రభుత్వం సహాయక చర్యలను పంపించిన కూడా మృతుల దేహాలను వెతుకు తీసే ప్రక్రియలోని వీరి పని కొనసాగుతోందని. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి యొక్క కుటుంబ సభ్యులకు సైతం అప్పగించే విధంగా చూస్తున్నారట. ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ ఘటన పైన తీవ్ర దిగ్భ్రాంతిని తెలియజేస్తూ బాధితులకు అన్ని విధాలుగా సహాయం చేస్తామంటూ కూడా ఆమె ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వం నుంచి తక్షణ సహాయం కూడా అందించేలా చర్యలు తీసుకున్నామని.. మెరుగైన వైద్యం కోసం అన్ని చర్యలు కూడా తీసుకున్నామని తెలియజేశారు. అయితే ఈ దుర్ఘటన జరిగిన తీరు అందుకు గల కారణాల పైన కూడా అధికారులు విచారణ జరిపిస్తున్నట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా పలు కఠిన చర్యలు తీసుకుంటామంటూ తెలుపుతున్నారు