అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేస్తోంది ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్). కడపలో అట్టహాసంగా జరుగుతున్న టీడీపీ `మహానాడు`లోనూ ఏఐ మాయాజాలం సృష్టించింది. నేడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, తెలుగు తేజం, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, నటరత్న, పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి కావడంతో.. మహానాడు వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ తో సహా పలువురు ప్రముఖులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. అలాగే ఈ సందర్భంగా టీడీపీ పార్టీ మరపురాని మరిచిపోలేని కానుకతో తెలుగు తమ్ముళ్లను ఆనందంతో పులకరించేలా చేసింది. ఏఐ టెక్నాలజీ ద్వారా ఎన్టీఆర్ స్పీచ్ ఇస్తున్నట్లుగా క్రియేట్ చేసి మహానాడు వేదికపై ప్రదర్శించింది. నిజంగా ఎన్టీఆర్‌రే మళ్లీ మన ముందుకు వచ్చి మాట్లాడుతున్నారా అన్నంత అద్భుతంగా ఈ ఏఐ వీడియో ఉంది.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు వివిధ అంశాలను ఏఐ ఎన్టీఆర్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. అంగరంగ వైభంగా జరుగుతున్న మహానాడు పండుగ వేళ 10 కోట్ల తెలుగు తమ్ముళ్లకు, ఆడపడుచులకు, రైతన్నలకు, శ్రమజీవులకు, దేశవిదేశాల్లో తెలుగు కీర్తి పతాకాలుగా వెలుగొందుతున్న బిడ్డలకు, వివిధ రంగాలలో తమ ప్రజ్ఞ పాఠవంతో తెలుగు తల్లికి సాంస్కృతిక సాంకేతిక సాహిత్య నిరాజం ఇచ్చిన కళాకారులకు, మేధావులకు, శాస్త్రవేత్తలకు, విజ్ఞులకు, ముఖ్యంగా పసుపు జెండాను గుండెలపై మోస్తున్న టీడీపీ కార్యకర్తలకు ఏపీ ఎన్టీఆర్ హృదయపూర్వకంగా నమస్సుమాంజలి తెలిపారు.
సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌లతో పాటు దేశప్రధాని నరేంద్ర మోదీపై కూడా ప్రశంసలు కురిపించారు. కొత్త జగతికి అపూర్వ ప్రగతికి టీడీపీ బాటలు వేసిందన్నారు. `హైదరాబాద్, సికింద్రాబాద్ లకు ట్యాంక్ బండ్ తో నేను సాంస్కృతిక వారధి కడితే.. ఆ తరువాత సైబరాబాద్ అనే కొత్త నగరాన్ని పుట్టించి తెలుగు నేలకు, ఆధునిక ప్రపంచానికి సాంకేతిక వారధిని కట్టినవాడు చంద్రబాబు. లక్షల రూపాయల జీతం గురించి ఏనాడైనా కలగన్నామా? దాన్ని సాధ్యం చేసింది నా తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పడానికి నాకు గర్వంగా ఉంది` అని ఏపీ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.
`యువ గణానికి ప్రాధాన్యం ఇచ్చి యువశక్తికి పదును పెట్టి నా కలలు నేడు తీరుస్తున్నాడు నా మనవడు లోకేష్. అధికారానికి సరైన నిర్వచనం మానవ సేవ అని ఆనాడు నేను పాటించిన నియమాన్ని నేడు ఆచరిస్తూ పార్టీ కార్యకర్తకైనా, సాధారణ పౌరుడికైనా అండగా నిలుస్తూ నా వారసత్వానికి వన్నె తీస్తున్న లోకేష్ ను చూస్తుంటే ముచ్చటేస్తుంది.. భళా మనవడా.. భళా..` అంటూ ఎన్టీఆర్ ప్రశంసించారు. అలాగే టీడీపీ తీసుకొచ్చిన పథకాల గురించి, తమ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి గురించి ఎన్టీఆర్ మాట్లాడారు. మొత్తంగా అదరహో అనేలా ఉన్న ఎన్టీఆర్ ఏఐ స్పీచ్ మహానాడుకు హాజరైన ప్రతినిధులు, కార్యకర్తలను ఎంతగానో ఆకట్టుకుంటూ నెట్టింట వైరల్ గా మారింది.