- ( రాయ‌ల‌సీమ - ఇండియా హెరాల్డ్ ) . . .


వైసిపి విధ్వంస పాలనలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది, దేశానికే అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ ను అప్పులప్రదేశ్ గా మార్చేశారు, ఒక్క కొత్త కంపెనీ రాకపోగా ఉన్న కంపెనీలు ఇతర రాష్ట్రాలకు పారిపోయాయి, అంతులేని ధనదాహంతో విషం కంటే ప్రమాదకరమైన మద్యాన్ని ఏరులై పారించి 30వేలమంది అమాయకుల ప్రాణాలను బలిగొన్నారు, వేలకోట్లు దోచుకొని రాష్ట్రాన్ని విధ్వంసం చేసి వెళ్లిపోయారని టిడిపి జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కడప మహానాడు వేదికపైనుంచి లక్షలాదిగా తరలివచ్చిన కార్యకర్తలనుద్దేశించి యువనేత లోకేష్ మాట్లాడుతూ... రెడ్ బుక్ పేరుచెప్పగానే ఒకడికి గుండెపోటు వచ్చింది, మరొకడు బాత్రూమ్ లో కాలిజారిపడ్డాడు, ఇంకొకడు ఏమయ్యాడో మీరందరికీ తెలుసు, అర్థమైందా రాజా? రెడ్ బుక్ అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలుచేయడమే. అంతా రెడ్ బుక్ రెడ్ బుక్ అని ఏడుస్తున్నారు. ఎవరైతే చట్టాలను ఉల్లఘించి ప్రజలను, కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో వారిని చట్ట ప్రకారం శిక్షిస్తాం అని చెప్పాను. ఇప్పుడు రెడ్ బుక్ అదే చేస్తుంది అని లోకేష్ చెప్పారు.


రెడ్ బుక్ కాదు రెడ్ కలర్ చూసినా వాళ్లకు నిద్ర పట్టడం లేదు. ఒక పద్ధతి ప్రకారం వాళ్ళు చేసిన తప్పులను ఎస్టాబ్లిష్ చెయ్యాలి. దానికి సమయం పట్టొచ్చు. కానీ శిక్ష తప్పదు. ఎవ్వరూ తప్పించుకోలేరు. రెడ్ బుక్ తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. ఇప్పుడు మనం అంతా డెవెలప్మెంట్ బుక్ మీద దృష్టి పెట్టాలి. మనకి ప్రజలు ముఖ్యం , వారి సంతోషం ముఖ్యం. వాళ్ళు చేసిన తప్పులు మనం చెయ్యకూడదు. అనవసరమైన కామెంట్స్ వద్దు. వాళ్ళని ఒక్క మాట కూడా అనొద్దు. వాళ్ళకి మనకి తేడా ప్రజలు గమనించారని యువనేత నారా లోకేష్ అన్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: