
వెన్నుపోటు దినాన్ని గొప్పగా నిర్వహించాలని పార్టీ నేతలని జగన్ గట్టిగా ఆదేశాలు ఇచ్చారు .. అలాగే ప్రతి నియోజకవర్గాల నుంచి రిపోర్టులో రావాలని కూడా దిశా నిర్దేశాలు చేశారు .. క్యాడర్కు విందులు ఇచ్చి మరీ ర్యాలీలను నిర్వహించాలన్నారు .. ఎంతవరకు చేసారో జగన్ కు రిపోర్టులు వచ్చి ఉంటాయి .. అయితే అసలు ప్రభుత్వం ఏర్పడిన వార్షికోత్సవం 12వ తారీఖున జరగాల్సి ఉంది .. ప్రభుత్వం అధికార పార్టీలు ఆ రోజున పెద్ద ఎత్తున సంబరాలు చేస్తాయి .. మరి వైసీపీ ఏం చేయనుంది ? తొందరపడి ఆలోచన లేకుండా ఏడాది పాలన వెన్నుపోటు అంటూ ర్యాలీలు చేసేసారు అసలు చేయాల్సిన రోజున చేయడానికి ఏమీ లేకుండా తెచ్చుకున్నారు .
ఎక్కడైనా ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజును ఎవరు వెన్నుపోటు దినముగా అనుకోరు .. నిరసనలు చేయరు. ఎందుకంటే అది ప్రజా తీర్పు ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు ఓడిపోతాయి కానీ అంతిమంగా ప్రజలే గెలుస్తారు .. అలాగే వారి తీర్పును ఎప్పుడు తక్కువ చేయకూడదు తమను ఓడించారని ప్రజల్ని ఎక్కడా నిందించలేరు .. అందుకే ప్రభుత్వం అధికారికంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజును వార్షికోత్సవంగా నిర్వహిస్తారు అధికారంలో ఉన్న పార్టీలు ఆ రోజున సంబరాలు చేసుకుంటాయి. విపక్షంలో ఉన్న పార్టీలు నిరసనలు చేస్తాయి కానీ వైసీపీ ఫలితాలు వచ్చిన రోజునే నిరసనలు మొదలు పెట్టింది .. ఇక ప్రభుత్వం ఏర్పడిన రోజున ఏం చేస్తుంది .. ఎలాంటి ఆలోచనలో ఉంది అనేది ఎవరికీ అంత చిక్కున ప్రశ్నగా మారింది .. అలాగే తాను చేసింది రాజకీయమని జగన్ భావిస్తూ వస్తున్నారు .. అలాగే తాను చెప్పింది వ్యూహం అని సలహాదారులు వింత వింత ఆలోచన చేస్తున్నారు .. బయట ప్రజలు ఏమనుకుంటున్నారో తమ క్యాడర్ ఏమనుకుంటుంది అనేది అసలు ఎవరు పట్టించుకోవడం లేదు .. అందుకే జగన్ వైసీపీ పరిస్థితి ఇంత దారుణంగా తయారైందని రాజకీయ విశేషాలు భావిస్తున్నారు ..