
అయితే.. ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే బాలినేని.. జనసేనలోకి వచ్చాక యాక్టివ్ పాలిటిక్స్ చేయలేక పోతు న్నారనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా బాలినేని అంటేనే.. బలమైన గళంతో పాటు.. బలమైన మద్దతు, కార్యకర్తలు కూడా ఉన్న నాయకుడు. అయితే.. బాలినేని జనసేనలోకి వచ్చిన తర్వాత.. ఇప్పటి వరకు పట్టుమని 100 మంది కార్యకర్తలను కూడా ఆయన తన వెంట తీసుకురాలేక పోయారనేది స్థానికంగా జరుగుతున్న చర్చ.
ఇది జనసేనలోనూ చర్చకు వస్తోంది. బాలినేని వ్యతిరేకించే.. జనసేన వర్గం కూడా.. ఈ విషయాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. బాలినేని ఒక్కరే వచ్చారని.. ఆయన వెంట ఎవరూ రాలేదని.. కూడా జనసేన కు చెందిన ఓ నాయకుడు వ్యాఖ్యానించారు. మరోవైపు.. వైసీపీ నాయకుడు.. జిల్లా ఇంచార్జ్‌గా ఉన్న బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కూడా దూకుడు పెంచారు. బాలినేని వర్గం గా ఉన్న నాయకులను, కార్యకర్తలను కూడా.. ఆయన చేజారకుండా చూస్తున్నారు.
నిరంతరం వారితో టచ్‌లో ఉన్నారు. వారిని బుజ్జగిస్తున్నారు. వారికి అవసరమైన అన్ని కార్యక్రమాలను చేస్తున్నారు. నియోజకవర్గంలోనే కాకుండా.. జిల్లా వ్యాప్తంగా కూడా.. పెద్ద ఎత్తున ఆయన పర్యటిస్తున్నా రు. దీంతో బాలినేని వర్గంగా ఒకప్పుడు ముద్ర వేసుకున్న వారు కూడా.. ఇప్పుడు మౌనంగా ఉన్నారు. అయితే.. వారంతా తనతోనే ఉన్నారని.. జనసేనలోకి వస్తారని బాలినేని చెబుతుండడం గమనార్హం. కానీ.. ఇప్పటి వరకు ఎవరూ బయటకు రాకపోవడం.. వంటివి మాత్రం బాలినేని రాజకీయాలపై చర్చ జరిగేలా చేస్తున్నాయి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు