ఏపీ సర్కార్ అమలు చేస్తున్న తల్లికి వందనం పథకంకు అన్ని వర్గాల ప్రజల నుండి ప్రశంసలు లభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం అమలు ఎంతోమంది తల్లుల కళ్ళలో ఆనందాన్ని నింపిందని చెప్పడంలో సందేహం అవసరం లేదు. కర్నూలు జిల్లాలో ఒకే ఇంట్లో ఆరుగురికి తల్లికి వందనం జమైంది. దేవనకొండ మండలానికి చెందిన చాంద్ బాషా, షకీనా బీ దంపతులకు ఆరుగురు కూతుళ్లు కాగా ఆరుగురు పిల్లలకు ఈ పథకం అమలు కావడం ఈ కుటుంబంలో సంతోషాన్ని నింపింది.

చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.  తమ  పిల్లల చదువుకు చంద్రబాబు సాయం చేసారని తల్లిదండ్రులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.  కొన్ని ప్రాంతాలలో చంద్రబాబు చిత్రపటానికి పాలతో అభిషేకం చేస్తున్నారు.  కూలి నాలీ చేసి చదివిస్తున్న కుటుంబాలు  ఖాతాలలో నగదు జమ కావడం  ఊహించని సంతోషాన్ని కలిగిస్తోందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం మాళాపురం గ్రామంలోని ఒక కుటుంబంలో ఆరుగురు పిల్లలు ఉండగా ఐదుగురు పిల్లలకు ఈ పథకం  అమలై 65  వేల  రూపాయలు జమయ్యాయి.  రెక్కాడితేగాని పూట గడవని పేదరికంటూ జీవిస్తున్న కుటుంబాలకు ఈ సహాయం మరింత మేలు చేస్తోంది.  చంద్రబాబు, పవన్ ఋణం తీర్చుకోలేనిది తల్లిదండ్రుల నోటి నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

చంద్రన్న ఇచ్చిన స్ఫూర్తితో  మా పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తామని తల్లిదండ్రులు చెబుతున్నారు.  చంద్రబాబుకు  ప్రత్యేక ధన్యవాదాలు అంటూ నెటిజన్లు కామెంట్లు  చేస్తున్నారు.  కుటుంబం పోషణకు అంతంత మాత్రమే సంపాదిస్తున్న ఎన్నో కుటుంబాలు  ఈ డబ్బులతో  పిల్లలకు అవసరమైన వాటిని కొనిస్తామని చెబుతున్నారు.



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: