
అయితే మరొ పక్క కృష్ణంరాజు మాత్రం ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు .. అయితే ఆ సమయంలో కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు అతని వ్యక్తిగతమని .. దాంతో తమ ఛానల్ కు ఎలాంటి సంబంధం లేదని సాక్షి వివరణ కూడా ఇచ్చిన .. ఆ ఒక్క వ్యాఖ్యలతో సాక్షి ఛానల్ మీద వైసిపి మీద తీవ్ర వ్యతిరేకత కూడా వచ్చింది .. ఈ వ్యవహారం సాక్షికి , వైసీపీకి , జగన్ కు భారీగా నెగిటివ్ ట్యాగ్ ను తెచ్చి పెట్టిన క్రమంలో సాక్షి మీడియా జాగ్రత్త పడింది .. ఎప్పుడూ లేనివిధంగా తమ ఛానల్ లో జరిగే చర్చ కార్యక్రమాల ముందు ఆ ఛానెల్ డిస్క్లైమర్ కూడా వేస్తుంది .. ప్రధానంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొనే అతిధులు వ్యాఖ్యలు పూర్తిగా వారి వ్యక్తిగతమని .. వారు చేసిన వ్యాఖ్యలతో తమ ఛానల్ కు ఎలాంటి సంబంధం లేదని కూడా అందులో పేర్కొంది . అలాగే ఆ వ్యాఖ్యలను సమర్థించడం కానీ ప్రచారం చేయడం కానీ అసలు చేయమని .. ఎవరైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే తాము అందుకు తాము బాధ్యతలు కామని .. వాటిని తీవ్రంగా ఖండిస్తున్నామని సాక్షి క్లారిటీ ఇచ్చింది ..
అలాగే తమ ఛానల్ కు విలువలు నిబంధనలు ఉన్నాయని వాటికి కట్టుబడి ఉంటున్నామని .. తాము ఎవరిని కించపరిచే ఉద్దేశం లేదని సాక్షి చెప్పుకొచ్చింది .. అయితే తెలుగు టీవీ ఛానల్ లో చర్చా కార్యక్రమాల మొదలుకు ముందు ఇలా డిస్క్లైమర్లు వైయడం ఇదే తొలిసారి కూడా కావచ్చు . తాజాగా జరుగుతున్న పరిణామాలు సాక్షి ఛానల్ కు గడ్డి తలనొప్పిగా మారాయని చెప్పడానికి ఇదే గట్టి ఉదాహరణ .. అయితే ప్రస్తుతం బెయిల్ మీద బయటకు వచ్చిన కొమ్మునేని కొన్ని రోజులు విశ్రాంతి తర్వాత మళ్ళీ ఛానల్లోకి వస్తారని కూడా అంటున్నారు . అయితే ఇక నుంచి ఆయనతో పాటుగా సాక్షిలో చర్చ కార్యక్రమాలు నిర్వహించే యాంకర్లు , జర్నలిస్టులు ఎంతో జాగ్రత్తగా ఉంటారని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు ..